సక్సెస్ ఫుల్ స్టోరీ : 10 వేలతో వ్యాపారం మొదలుపెట్టి కోట్లలో టర్నోవర్.. ఎలా అంటే?

కొన్ని కథలు వింటే మనలో కూడా కొత్త శక్తి వస్తుంది.కొంతమంది తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి.

 Neeta Adappa Success Story, Neeta Adappa, Prakriti Herbals, Top Enterprenuer, Bu-TeluguStop.com

ఇప్పుడు చెప్పబోయే సక్సెస్ ఫుల్ స్టోరీ కూడా మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతుంది.జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మంచి నిర్ణయం తీసుకోవడమే కాదు దానిని ఆచరణలో కూడా పెట్టాలి.

అప్పుడే అది సక్సెస్ ఫుల్ అవుతుంది.బెంగళూరు నివాసి అయిన నీతా అడప్పా దీనికి ఒక ఉదాహరణ.

ఈమె పేరు నీతా అడప్పా.ఈమెది బెంగళూరు.ఈమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన సాధారణ యువతి.ఈమె ఫాదర్ మూలికా ఉత్పత్తి తయారీ సంస్థలో సేల్స్ మేనేజర్ గా పని చేసేవాడు.

ఈమె ముంబైలో మాస్టర్స్ చేసింది.నీతాకు వ్యాపారం చేయాలనీ ఉండేది.

అందుకే ఈమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం 10 వేల రూపాయలతో వ్యాపారాన్ని మొదలుపెట్టారు.ఇప్పుడు కోట్ల టర్నోవర్ తో వ్యాపారాన్ని సుస్థిరం చేసుకున్నారు.

Telugu Story, Neeta Adappa-Latest News - Telugu

నీతా అడప్పా 1995 లో వ్యాపారాన్ని మొదలు పెట్టింది.అప్పటి రోజుల్లో ఒక మహిళ వ్యాపారం చేయడం అంత తేలికైన విషయం కాదు.వీటికి విరుద్ధంగా ప్రకృతి హెర్బల్స్ అనే సంస్థను ప్రారంభించారు.చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులపై సుదీర్ఘ పరిశోధనల తరువాత తన స్నేహితురాలితో కలిసి 10 వేల రూపాయలు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు.

అప్పటికే మార్కెట్ లో చాలా రకాల ఉత్పతులు అందుబాటులో ఉన్నాయి.అందుకే నీతా తన వ్యాపారాన్ని భిన్నమైన పద్దతిలో కొనసాగించాలని నిర్ణయించుకుంది.

నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తులను తయారుచేస్తూ ముందుగా ఒక హోటల్ ద్వారా ఆర్డర్ పొందింది.హోటల్ రంగంలో విజయం సాధించాక 2011 లో రిటైల్ రంగంలో ప్రవేశించింది.

ఫేస్ స్క్రబ్స్, హెయిర్ మాస్క్, హెయిర్ ఆయిల్, షాంపూలు, కండీషనర్ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించారు.తన ఉత్పత్తుల్ని వెబ్‌సైట్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ పోర్టల్స్ లో కూడా అందుబాటులో ఉంచారు.

ఆమె పట్టుదలతో.విభిన్నమైన ఆలోచనలతో ఈ స్థాయికి చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube