ఖతర్ లోని ఎన్నారై విద్యార్ధులకు షాక్ ఇచ్చిన NEET...!!!

గడిచిన కొంత కాలంగా నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఖతర్ లోని భారత ఎన్నారై విద్యార్ధులు చేస్తున్న నిరసనలు అందరికి తెలిసిందే.సుమారు 40 రోజుల పాటు నిరవధికంగా నిరసన చేపడుతూనే ఉన్నారు.

 ఖతర్ లోని ఎన్నారై విద్యార్ధు�-TeluguStop.com

కానీ ఊహించని విధంగా నిరసన చేస్తున్న విద్యార్ధులకు షాక్ ఇస్తూ నీట్ పరీక్ష తేదీనీ విడుదల చేసింది.దాంతో భారతీయ విద్యార్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ ఎందుకు నీట్ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్ధులు ఆందోళన చేపట్టారు అనే వివరాలను పరిశీలిస్తే.

2022 -23 విద్యా సంవత్సరానికి గాను నీట్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ తేదీలను వెల్లడించింది.దాంతో ఖతర్ లోని భారతీయ ఎన్నారై విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.నీట్ –యూజి 2021 కౌన్సిలింగ్ మే నెలలో ముగియగా సిబిఎస్ఈ 12th పరీక్షలు జూన్ 15 తో ముగిసాయి.

దాంతో నీట్ –యూజి 2022 ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ప్రిపరేషన్ కు ఎలాంటి సమయం ఉండటం లేదు, దాంతో నీట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ భారత సంతతి విద్యార్ధులు నిరసనలు తెలిపారు.తమకు జరిగే అన్యాయాన్ని తెలుపుతూ విద్యా శాఖకు రాతా పూర్వక మెమోరండం కూడా ఇచ్చారు…కానీ.

Telugu Cbse, Indian Embassy, Neet, Nri, Qatar-Telugu NRI

విద్యా శాఖ నుంచీ ఎలాంటి సానుకూల స్పందన రాలేదు సరికదా పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఈ విషయాన్ని పక్కకు పెట్టేసింది.ఈ క్రమంలో నీట్ అనుకున్నట్టుగానే జులై అంటే ఈ నెల 17 వ తేదీన పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తోంది నీట్.నీట్ ఇచ్చిన ప్రకటనను తాజాగా ఖతర్ లోని ఇండియన్ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్ లో పరీక్ష తేదీలను ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.ఇదిలాఉంటే నీట్ పరీక్షలు ఖతర్ లో నిర్వహిచుకునేలా అనుమతులు ఇవ్వాలంటూ ఖతర్ లోని ఇండియన్ ఎంబసీ ద్వారా ఎన్నారైలు చేసిన విజ్ఞప్తి మేరకు గడిచిన ఏడాదే కేంద్రం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube