దర్శకురాలిగా మారబోతున్న నీరజ కోన  

neeraja kona become a Director, Tollywood, Kona Venkata, Telugu Cinema - Telugu Kona Venkata, Neeraja Kona Become A Director, Telugu Cinema, Tollywood

కాస్ట్యూమ్ డిజైనర్ గా, హీరోయిన్స్ స్టైలిస్ట్ గా టాలీవుడ్ సుపరిచితమైన పేరు నీరజ కోన, ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ తో కనిపించే ఈ కాస్ట్యూమ్ డిజైనర్ పెద్ద పెద్ద సినిమాలకి పని చేసింది.స్టార్ హీరోయిన్స్ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ముందుగా సినిమాలలో ఆమె పేరే వినిపిస్తుంది.

TeluguStop.com - Neeraja Kona Become A Director

Source:TeluguStop.com

ఈ మధ్య కాలంలో మామూలు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వారిలో నీరజ కోన పేరు ఎక్కువగా వినిపిస్తుంది.ఈమె హీరో నితిన్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా.

TeluguStop.com - దర్శకురాలిగా మారబోతున్న నీరజ కోన-Movie-Telugu Tollywood Photo Image

నితిన్ పెళ్ళిలో వారిద్దరికి కాస్ట్యూమ్ డిజైన్స్ నుంచి లుక్, స్టైలిష్ అంతా ఆమెనే దగ్గరుండి చూసుకుంది.ఈ నీరజ కోన స్టార్ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సొంత చెల్లి అని అందరికి తెలిసిందే.

ఇక ఈమె ఇంతకాలం కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన తన అన్నలాగే తనలో కూడా ఒక రచయిత ఉందని చెబుతుంది.ఇప్పటికే చాలా కథలు రాసుకొని సిద్ధంగా ఉంచుకుందని సమాచారం.

తాజాగా ఓ యుట్యూబ్ చానల్ ద్వారా తన వంటలని పరిచయం చేస్తున్న నీరజ కోన తనలోని మరో టాలెంట్ ని బయట పెట్టింది.తన దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పింది.

దీనిని బట్టి ఫ్యూచర్ లో దర్శకత్వం చేసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పేసింది.త్వరలోనే ఓ చిత్రానికి డైరెక్షన్ చేస్తా అని తన దగ్గర ఒక ప్రణాళిక ఉందని, ప్రస్తుతానికి తాను డైరెక్ట్ చెయ్యబోయే మొదటి చిత్రం కోసం కొంతమంది నటులను సంప్రదిస్తున్నట్లుగా నీరజ కోన చెప్పుకొచ్చింది.

మొదటి సినిమాని ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించే అవకాశం ఉందని ఆమె మాటల బట్టి తెలుస్తుంది.అయితే ఆమె కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆ యువ హీరో ఎవరై ఉంటారా అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

#Kona Venkata #NeerajaKona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Neeraja Kona Become A Director Related Telugu News,Photos/Pics,Images..