యువతకు నీరజ్ చోప్రా సందేశం..!

టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరస్ చోప్రాతో పాటుగా ఇండియా వైపు ఆడినటువంటి ఆటగాళ్లందరూ స్వతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.వందేళ్ల రికార్డు బ్రేక్ చేసిన నీరజ్ చోప్రా ఈ సందర్భంగా యువతకు ఓ సందేశాన్నిచ్చారు.

 Neeraj Chopra's Message To Youth Neeraj Chopra, Statement, Young Mans, Sports Up-TeluguStop.com

విజయం సాధించాలంటే తమని తాము నమ్ముకోవాలన్నాడు.తమ కోచింగ్ ని నమ్ముకుని కష్టపడాలని చెప్పాడు.

అయితే విజయం సాధించే విధానంలో షార్ట్ కట్లు వంటివి తీసుకోవద్దని సూచించాడు.ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఎగురవేయడానికి ముందుగా నీరజ్ చోప్రా ప్రజలనుద్దేశించి ప్రసంగించాడు.

గతంలో ఆ ఎర్రకోటపై జెండా రెపరెపలను టీవీల్లో చూసేవాడినని తెలిపాడు.ఇప్పుడు తాను నిజంగా ఎర్రకోటపై నిలబడి ఈ వేడుక చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అయితే ఈ ఘటన తన జీవితానికి ఓ సరికొత్త అనుభూతిని ఇచ్చిందన్నారు.ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఛాన్స్ ఇచ్చిన ప్రధాని మోడీకి మనసారా ధన్యవాదాలు తెలిపాడు.

ఎప్పుడూ కూడా తనకు ఉదయాన్నే ఇంత త్వరగా నిద్రలేచే అలవాటు ఉండేది కాదన్నారు.గత రెండు రోజుల నుంచి నీరజ్ చోప్రాకు తీవ్రమైన జ్వరం ఉంది. దేశం మొత్తం అతను కోలుకోవాలని పూజలు చేశారు.చివరికి తన ఆరోగ్యం బాగైంది.

వైద్యులు నీరజ్ చోప్రాను కొన్నిరోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని తెలిపారు.నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సత్తాను చాటాడు.

గోల్డ్ మెడల్ సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కాడు.

Telugu Neeraj Chopra, Meida, Ups, Tokyo Olm, Latest, Young-Latest News - Telugu

ప్రధాని మోడీ మాట్లాడుతూ.దేశానికి ఒలింపిక్స్ ఆటగాళ్లు కీర్తిని తెచ్చారన్నారు.ప్రజలను మనసులను గెలిచారన్నారు.

వారు చూపిన ఆటతీరు యువతకు స్ఫూర్తిని కలిగించిందన్నారు.ఆ తర్వాత ప్రధాని మోడీ ఒలింపిక్స్ వెళ్లిన క్రీడాకారులందరితో ముచ్చటించారు.

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కూడా టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లిని వారందరినీ ప్రత్యేకంగా పలకరించి వారిని అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube