కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొన్న నీరజ్ చోప్రా.. అమితాబ్ ఏం ప్రశ్నించారంటే..

టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశానికి పసిడి పతకాన్ని సాధించి పెట్టిన దిగ్గజ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్నారు.షాన్‌దార్ శుక్రవార్ పేరుతో సెప్టెంబర్ 17 రాత్రి సమయంలో టెలికాస్ట్ అయిన ప్రోగ్రామ్ లో అతను ఒక స్పెషల్ గెస్ట్‌గా వచ్చి ఆశ్చర్యపరిచారు.

 Neeraj Chopra Involved In Kaun Banega Crorepati .. What Did Amitabh Ask  Neeraj-TeluguStop.com

ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోకి బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కూడా విచ్చేశారు.భారత దేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్, శ్రీజేష్ లను తన షోలో చూసి హోస్ట్ అమితాబ్ బచ్చన్ సంతోషపడ్డారు.

నీరజ్ చేతిలోని గోల్డ్ మెడల్ చూసి బిగ్ బీ ఓ చిన్న పిల్లాడిలా ప్రవర్తించారు.అంతేకాదు, ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న వేసి అందరిని అవాక్కయ్యేలా చేశారు.

అమితాబ్ బచ్చన్ నీరజ్ ను ఉద్దేశిస్తూ మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? ఈ మెడల్‌ను నేను టచ్ చేయొచ్చా? అని ప్రశ్నించారు.చిన్న పిల్లాడి వలె ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యి అమితాబ్ ప్రశ్నించడంతో నీరజ్ తో సహా అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత వెంటనే ఆ ఇద్దరూ తమ ఒలింపిక్స్ పతకాలను బిగ్ బీ చేతికందించారు.వాటిని తీసుకున్న తర్వాత ఇవి చాలా బరువున్నాయి, బాగున్నాయి’ అని అమితాబ్ ఆశ్చర్యపోతూ చెప్పుకొచ్చారు.

ఈ మెడల్స్ చేత్తో తాకితే చాలు.అదే తనకు పెద్ద అదృష్టమని అన్నారు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Telugu Amithabh Bachan, Kaunbanega, Latest, Neeraj Chopra, Program-Latest News -

ఈ ఎపిసోడ్ లో ఇంకా చాలా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయిబిగ్ బీ సినిమా డైలాగ్‌లను హర్యాన్వీ భాషలోకి తర్జుమా చేసి చెప్పి నీరజ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.అలాగే జావెలిన్ ఈటె ఎలా విసరాలో నీరజ్ చెప్తే.హాకీ ఎలా ఆడాలో శ్రీజేష్ వివరించారు.

నీరజ్ చోప్రా తన విజయ గాధ సైతం చెప్పారు.అలాగే చాలా సరదాగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube