సొంత పార్టీలోనే నిరసనలు : భారతీయురాలికి పదవి దక్కకుండా డెమొక్రాట్ల మోకాలడ్డు..!!

అత్యున్నత పదవులు దక్కుతుంటే సొంత పార్టీ నుంచే అసమ్మతి గళాలు వినిపించడం భారత రాజకీయాల్లో మనం ఎన్నో చూశాం.అయితే ఇందుకు ఏ దేశమూ మినహాయింపు కాదని ప్రపంచ రాజకీయాల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే అర్థమవుతుంది.

 Neera Tanden, Joe Biden’s Budget Nominee, Faces Challenge To Confirmation, Joe-TeluguStop.com

అమెరికా విషయానికి వస్తే … అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జో బైడెన్ పలువురు భారతీయులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ వస్తున్నారు.అందులో భాగంగానే ఇండో అమెరికన్ మహిళ నీరా టాండన్‌ను మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు.

ఈ నామినేషన్‌ను సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది.ఈ క్రమంలోనే నీరా నామినేషన్ పట్ల సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత వ్యక్తవమవుతోంది.

గతంలో ఆమె చేసిన ‘పక్షపాత’ వ్యాఖ్యల విషయమై డెమొక్రాట్ సెనేటర్ జో మాంచిన్ .తాను నీరాకు మద్దతుగా ఓటు వేయబోనని ఆయన తేల్చి చెప్పారు.మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నీరా టాండన్ నామినేషన్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాంచిన్ స్పష్టం చేశారు.డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల నాయకులపై ఆమె గతంలో చేసిన దురుసు వ్యాఖ్యల చరిత్రను ఈ సందర్భంగా మాంచిన్ గుర్తు చేశారు.

ఈ ధోరణి ఎంతో ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.నీరా టాండన్ పక్షపాత ప్రకటనలు కాంగ్రెస్ సభ్యులకు, బడ్జెట్ కార్యాలయం , డైరెక్టర్ పని సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడడ్డారు.

మాంచిన్ ప్రకటన నేపథ్యంలో సెనేట్‌లో నీరా టాండన్ నామినేషన్‌కు అడ్డంకిగా ఏర్పడే అవకాశం ఉంది.మరి ఈ సమస్యను జో బైడెన్ ఎలా పరిష్కారిస్తారో వేచి చూడాలి.

Telugu Democraticjoe, Joe Biden, Joebidens, Neera Tanden, Presidential-Telugu NR

కాగా, ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ఇండో అమెరికన్ నీరా టాండన్ ను బడ్జెట్ చీఫ్ గా నియమిస్తున్నట్టు గతేడాది నవంబర్‌లోనే బైడెన్ వెల్లడించారు.బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెల్త్ కేర్ విభాగంలో నీరా బాధ్యతలు నిర్వహించారు.2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున ట్రంప్‌ను సవాల్ చేసిన హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగానూ సేవలందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube