పాచిపని చేయడానికి సిద్ధమైన నటి.. ఎవరంటే??

సామాన్యులే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా తాము కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమ నిజ జీవితంలో ఎన్నో పనులు చేసి పైకి వచ్చిన వారు ఉన్నారు.

 Neena Gupta Raising Her Daughter Masaba Gupta Without Any Financial Help-TeluguStop.com

ఇక పాచి పని చేయడానికి కూడా ముందుకు వచ్చిందట ఓ నటి.ఇంతకీ ఆ నటి ఎవరంటే.

బాలీవుడ్ సీనియర్ సిని, టెలివిజన్ నటి నీనా గుప్తా. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఎన్నో సినిమాలలో నటించిన ఆమె తన నటనకు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.ఇక బుల్లితెరలో కూడా పలు ప్రోగ్రామ్ లను నిర్వహించింది నీనా.

 Neena Gupta Raising Her Daughter Masaba Gupta Without Any Financial Help-పాచిపని చేయడానికి సిద్ధమైన నటి.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈమె ప్రస్తుతం ఎంత మంచి స్థానంలో ఉందో ఒకప్పుడు కొన్ని పాచి పనులు కూడా చేసిన రోజులు ఉన్నాయని తెలిపింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీనా గుప్తా తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని విషయాల గురించి పంచుకుంది.

Telugu Actor, Bollywood, Director, Financial Help, Heroine, House Hold Works, Masaba Gupta, Neena Gupta, Neena Gupta Financial Condition-Movie

స్వతంత్రంగా ఎలా బతకాలో అనేది తన తల్లి నుంచి నేర్చుకున్నానని తెలిపింది.తనను పెంచి పెద్ద చేయడానికి పాచి పనులు కూడా చేయడానికి సిద్ధపడ్డాదట.అంతేకాని ఎవరిని సాయం కోసం చేయి చాచి అడగలేదని తెలిపింది.తను ఎవరి మీదా ఆధారపడకూడదని నిర్ణయించుకుందట.అది డబ్బు విషయంలోనే కాకుండా మరే విషయంలోనైనా కూడా అలాగే నిశ్చయించుకుందట.

పొట్టకూటి కోసం ఏ పని చేసిన అందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తన తల్లి దగ్గర నేర్చుకున్నానని తెలిపింది.ఇల్లు ఊడవడం, అంట్లు తోమడం సహా ఎలాంటి పనులు అయినా చేస్తాను కానీ ఎవరి దగ్గర పైసా కూడా అడగకూడదనుకుందట.​తన కుటుంబం, తన స్నేహితుల దగ్గర కూడా ఎప్పుడూ ఆర్థికంగా సహాయం కూడా కోరలేదని తెలిపింది.

ఇక నీనా కూతురు మసాబా గుప్తా కూడా బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తుంది.

#Heroine #Financial Help #Director #Actor #NeenaGupta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు