ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ యాంకర్…  

Neeli Neeli Aakasam Hits 100 Million Mark 30 Rojullo Preminchadam Ela Amrutha Ayyar Anoop Rubens - Telugu 30 Rojullo Preminchadam Ela, Amrutha Ayyar, Anoop Rubens, Collectively, Neeli Neeli Aakasam Hits 100 Million Mark, Neeli Neeli Aakasam Received 23 Million Views In T Series Channel, The Same Clocked 78 Million In Lahari Music

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అమృత అయ్యర్ నటిస్తోంది.

 Neeli Neeli Aakasam Hits 100 Million Mark 30 Rojullo Preminchadam Ela Amrutha Ayyar Anoop Rubens

అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు మున్నా దర్శకత్వం వహించాడు.అలాగే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బాబు ఎస్వీ నిర్మాతగా వ్యవహరించగా ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి సంగీతం ఇప్పటికే విడుదలకాగా ఇందులో నీలి  నీలి ఆకాశం అనే పాట తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అంతేగాక తాజాగా ఈ పాట యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది.

ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ యాంకర్…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోలు సరసన కొనసాగుతోంది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అంతేగాక దాదాపుగా ఈ పాట వల్లే ఈ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అందుకుగాను చాలా ఆనందంగా ఉందని అంటున్నారు దర్శకుడు మున్నా.

అయితే ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీ ఖరారు అయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను మూసి వేసినందువల్ల కొంత కాలం పాటు ఈ ఈ చిత్ర విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు.

అయితే తొందర్లోనే ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Neeli Neeli Aakasam Song Reach 100 Million Mark Related Telugu News,Photos/Pics,Images..