12 ఏళ్లకు ఓసారి పూసే ఈ పువ్వుల స్పెషల్ ఏంటో తెలుసా !

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు ఉంటాయి.చాలా మంది ప్రకృతి ని చూస్తూ తమని తాము కూడా మర్చిపోతారు.

 Neelakurinji Flowers That Bloom Once In 12 Years Blossom In Kerala-TeluguStop.com

అంత లీనమై చూస్తారు.పచ్చని చెట్ల మధ్య కాసేపు సమయం గడిపిన కూడా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.

మనకు ఉన్న కష్టాలు టెన్షన్స్ అన్ని మర్చిపోయి కొద్దీ సేపు ప్రశాంతంగా గడుపుతాము.

 Neelakurinji Flowers That Bloom Once In 12 Years Blossom In Kerala-12 ఏళ్లకు ఓసారి పూసే ఈ పువ్వుల స్పెషల్ ఏంటో తెలుసా -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా మంది తమ టెన్షన్స్ తగ్గించు కోవడం కోసం వీలు ఉన్నప్పుడల్లా విహారయాత్రకు వెళ్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతారు.

అందమైన చెట్లు, పువ్వులు మధ్య కొంత సమయం గడిపిన ఉల్లాసంగా మారిపోతాము.మీకు కూడా ప్రకృతి అంటే ఇష్టమైతే ఈ ప్లేస్ కు మాత్రం తప్పకుండ వెళ్లాల్సిందే మీకు వీలు కుదిరితే ఈ టైం చాలా మంచి సమయం.

ఎందుకంటే ఆ ప్రదేశంలో పూసిన పువ్వులు చుస్తే మీరు మంత్రముగ్దులు అవ్వడం ఖాయం.

అంత స్పెషల్ ఏముందా ఆ పువ్వులలో అని అనుకుంటున్నారా అవును ఆ పువ్వులు చాలా స్పెషల్ వీటి పేరు నీలాకురింజి పువ్వులు ఇవి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయట అప్పుడు చూడాలి ఆ ప్రదేశమంతా బ్లు కార్పెట్ పరిచినట్టు చాలా అందంగా ఉంటుంది.చూడడానికి రెండు కళ్ళు చాలవు.ఈ పువ్వుల నుండి సేకరించిన తేనె చాలా స్పెషల్ అంట.ఎందుకంటే ఈ తేనే ఎన్నో పోషకాలను కలిగి ఉంటుందని నమ్ముతారు.

కెరలోని శాంతంపర షలోమ్ హిల్స్ లో అచ్చం అలాగే ఉంటుంది.ఈ నీలాకురింజి పువ్వులు జులై అక్టోబర్ నెలల మధ్యలో వికసిస్తాయి.ఈ పువ్వులను చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తున్నారు.

ఈ పువ్వుల పరాగ సంపర్కానికి చాలా సమయం పడుతుందట.అందుకే ఇవి 12 సంవత్సరాల కొకసారి పూస్తాయి.

తాజాగా ఈ పువ్వులు అందంగా వికసించి గాలికి ఊగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మీరు కూడా ఈ అందమైన పువ్వులను ఒక్కసారి ఈ వీడియోలో చూసి ఆనందించండి.

https://twitter.com/ANI/status/1422008254616379396
#Natural Lovers #WhatA #BloomsOnce #WhichBlooms

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు