42 ఏళ్ల ఉపాధ్యాయుడి పెళ్లి ప్రకటన, రిక్వైర్ మెంట్ ఏంటో తెలుసా  

Need Rs 10 Crores Assert Bridal-

పత్రికల్లో మాట్రిమోనియల్ ప్రకటనలు సర్వ సాధారణం ఎవరి రిక్వైర్ మెంట్ ను బట్టి వారు ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటారు.ఇటీవల 84 ఏళ్ల ముసలాయన నా కాళ్లు,కళ్లు,చెవులు అన్ని పనిచేస్తున్నాయి.నాకు ఒక పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి అంటూ వింతైన ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక వ్యక్తి పత్రికలో పెళ్లి కోసం ప్రకటన ఇచ్చాడు...

Need Rs 10 Crores Assert Bridal--Need Rs 10 Crores Assert Bridal-

అయితే ఇంతకీ ఆ ప్రకటనలో ఆయన గారి రిక్వైర్ మెంట్ ఏంటో తెలుసా వధువుకి కనీసం రూ.10 కోట్లు ఆస్థి ఉండి ఉండాలి అంటూ ప్రకటన ఇచ్చాడు.పశ్చిమ బెంగాల్ లోని సిలిగుడికి చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ మేరకు షరతు తో కూడిన పెళ్లి ప్రకటన విడుదల చేశాడు.సిలిగుడిలోని కాలియాగంజ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు (42) గా పనిచేస్తున్న ఆయన తనపేరు కూడా చెప్పకుండా, అమ్మాయి పేరుమీద రూ.10 కోట్ల ఆస్తి ఉండాలని అలాంటి అమ్మాయి కావలి అంటూ షరతు పెట్టాడు.ఈ వింత ప్రకటన పాఠకులను ఆకట్టుకుంది.

Need Rs 10 Crores Assert Bridal--Need Rs 10 Crores Assert Bridal-

దీనితో ఇక నెటిజన్లు ఆగుతారా మరి వెంటనే సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.అయితే నెటిజన్ల హడావిడికి అసలు ఇంతకీ ఆ ప్రకటన ఇచ్చిన ప్రధాన ఉపాద్యాయుడు ఎవరు ఏంటి అన్న వివరాలను వెతికే పనిలో పడ్డారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.ఎవరైనా 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడు పిల్ల దొరికితే చాలు అనుకోకుండా ఈ విధంగా షరతులు పెట్టడం మాత్రం విడ్డూరంగా ఉంది.పాపం పెళ్లి సంగతి ఏమో గాని ఆయన గారు ఎవరు అన్న విషయం మాత్రం తెలిస్తే తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలు చర్యలు తీసుకోవడం మాత్రం ఖాయం