ఎండకాలంలో మొటిమల బెడద - ఈ జాగ్రత్తలు తప్పవు  

Necessities In Summer For Controlling Pimples-

ఎండలు మొదలయ్యాయి. చెమటలు విపరీతంగా పడుతున్నాయి. ఈ మూడు నాలుగు నెలలు మెటిమల బెడద లేని జనాల బాధ ఒక ఎత్తైతే, మొటిమలు ఇబ్బంది ఉన్న జనాల బాధ మరో ఎత్తు..

ఎండకాలంలో మొటిమల బెడద - ఈ జాగ్రత్తలు తప్పవు-

భగభగలాడే ఎండలో, ఆ యూవి రేస్ చర్మం దాడి చేస్తోంటే, చర్మం చమటలు కక్కుతోంటే, ముఖం కూడా దురదగా అనిపిస్తోంటే, మొటిమలు ఎక్కువైపోయి, చర్మం నల్లబడిపోయి . వామ్మో! ఆ బాధను వర్ణించటం కూడా కష్టం.

అందుకే ఎండకాలంలో మొటిమల రిస్క్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొటిమలని కంట్రోల్ చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.మొదటగా, డైట్ బాగా మెయింటేన్ చేయాలి.

ఎంత ఇష్టం ఉన్నాసరే, చాకొలెట్లు, ఐస్ క్రీమ్స్, పిజ్జా, ఇతర బేకరీ ఫుడ్స్ మానేయ్యాలి. ఎండకాలంలో ముఖానికి అవి చేసే హాని పదిరేట్లి పెరిగిపోతుంది. స్పైసీ ఫుడ్స్ కూడా మానెయ్యాలి.

లైట్ ఫుడ్ ఎక్కువగా తినాలి. కూల్ డ్రింక్స్‌ అస్సలు వద్దు. పండ్లరసం తాగండి.

ముఖ్యంగా సిట్రస్ జాతి ఫలాలు, అంటే నిమ్మ, ఆరెంజ్ జ్యూస్ తాగండి. ఫైబర్ బాగా ఉంటే ఆహారం తీసుకోండి. పుచ్చకాయ ఎలాగో బాగా దొరుకుతుంది ఈ సీజన్ లో.

ఇష్టపడండి.రోజుకి రెండుసార్లు అయినా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. కుదిరితే రెండుసార్లు స్నానం చేయాలి.

టీ ట్రీ ఆయిల్, సాలిక్లినిక్ ఆసిడ్, గ్లికోలిక్ ఆసిడ్, రెటినోల్, బెంజైల్ పెరాక్సైడ్, లాంటి ఎలిమెంట్స్ ఉన్న ఫేస్ మాస్క్‌లు మొటిమల్ని కంట్రోల్ చేస్తాయి. డాక్టర్ ని సంప్రదించి మంచి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్, నైట్ క్రీమ్ ఉపయోగిస్తే మంచిది.ఇక బేసిక్ టిప్స్, నీళ్ళు బాగా తాగాలి.

మంచినీళ్ళు బాగా తాగడం వలన శరీరం హైడ్రేటెడ్ గా ఉండి, చర్మాన్ని కూడా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. రోజుకి 7-8 గంటల నిద్ర కంపల్సరి. ఎండకాలంలో కూడా నిద్రలేమి, స్ట్రెస్ లాంటి సమస్యలు ఉంటే మొటిమలని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది.