జనవరి నెలలో బ్యాంకు సెలవులు అన్ని రోజులా..?

కరోనా మహమ్మారి వల్ల బ్యాడ్ ఇయర్ గా ప్రజల దృష్టిలో మిగిలిపోయిన 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పడానికి మరో 5 రోజుల సమయం మాత్రమే ఉంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, సూచనల మేరకు 2021 సంవత్సరం జనవరి నుంచి బ్యాంకులు కొన్ని నిబంధనలలో మార్పులు చేయనున్నాయి.

 Nearly 13 Days Bank Holidays For January 2021, January 2021, 13 Days Bank Holida-TeluguStop.com

సాధారణంగా ప్రతి నెలా వచ్చే సెలవులతో పోలిస్తే 2021 జనవరి నెలలో సెలవులు ఎక్కువగా ఉన్నాయి.
రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలతో కలిపి దాదాపు 13 రోజులు సెలవులు ఉన్నాయి.

తరచూ బ్యాంకులలో లావాదేవీలు జరిపే కస్టమర్లు ముందుగానే సెలవుల గురించి తెలుసుకుంటే లావాదేవీల నిర్వహణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు.అయితే రాష్ట్రాలను, బ్యాంకులను బట్టి సెలవులలో స్వల్పంగా మార్పులు ఉంటాయి.

జనవరి నెల బ్యాంకు సెలవులను పరిశీలిస్తే 1, 2 తేదీలలో నూతన సంవత్సరం సందర్భంగా సెలవులు ఇస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది.

Telugu Bank Holidays, January, Januarybank, Daysbank, Republic Day, Sankranthi-G

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ సెలవు దినంగా ఉంది.జనవరి 15వ తేదీ, జనవరి 16వ తేదీ చెన్నైవాసులకు తిరువల్లూవర్ డే, ఉజవర్ తిరునాల్ సందర్భంగా సెలవు దినాలుగా ఉన్నాయి.జనవరి 23వ తేదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కాగా కోల్ కతా, అగర్తాల ప్రాంతాలలో ఆరోజు సెలవు దినంగా ఉంటుంది.

జనవరి 25వ తేదీన ఇమోయిను ఇరత్పా సందర్భంగా ఇంఫాల్ ప్రజలకు సెలవుదినంగా ఉంది.జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు దినంగా ఉంది.

జనవరి 3, 10, 17, 24, 31 తేదీలు ఆదివారాలు కాగా జనవరి 9, 23 తేదీలు రెండు, నాలుగు శనివారాలుగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల ప్రజలకు దాదాపు 13 రోజులు సెలవు దినాలుగా ఉండటంతో ముందుగానే బ్యాంకు పనులను పూర్తి చేసుకుంటే లావాదేవీల నిర్వహణ సమయంలో ఇబ్బందులు ఎదురుకావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube