అమెరికా నిర్భందంలో మరో 100 మంది భారతీయులు       2018-06-22   23:29:14  IST  Bhanu C

అమెరికాలో భారతీయుల నిర్భంధం రోజు రోజు కి పెరిగిపోతోంది..రెండు రోజుల క్రితం అమెరికా లో వలసదారులని నిర్భందించిన సమయంలో దాదాపు 50 మంది వరకూ ఉండగా తాజాగా నిర్భంధంలోకి మరో 50 మందిని ఉంచారు..వీరిని రెండు నిర్భంద కేంద్రాలలో ఉంచారని..వీరిలో దాదాపు వంద మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అమెరికాలోని ఇండియన్ మిషన్ ప్రకటించింది..అయితే ఈ 100 మందిలో అధికశాతం మంది పంజాబ్ రాష్ట్రానికి చెందినా వారు ఉన్నారట.

అయితే వీరిని న్యూ మెక్సికో సరిహద్దుల్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో 40 నుంచి 45 మంది భారతీయులు, ఆరిగాన్ డిటెన్షన్ సెంటర్‌లో 52 మంది సిక్కులు, క్రైస్తవులు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది..ఇదిలాఉంటే భారత ఎంబసీ అధికారులు ఈ రెండు కేంద్రాలకి వెళ్లి అక్కడ పరిస్థితులని పరిశీలించి వచ్చారట. ఈ కేంద్రాల్లో ఉన్న వారు ఆశ్రయం అడుగుతున్నారని తెలిపారు…ఉత్తర అమెరికా పంజాబ్ అసోసియేషన్‌కు చెందిన సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ అమెరికా జైళ్లలో మగ్గుతున్న వారిలో పంజాబీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు.

గతంలో అంటే 2013..నుంచి 2015 వరకు గడిచిన మూడేళ్ళ కాలంలో అమెరికా సరిహద్దుల్లో 27వేల మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు…ఇందులో 4వేల మంది మహిళలు, 350 మంది బాలబాలికలు ఉన్నారు.అ..అయితే ఎంతో మంది అక్రమంగా పంజాబీలు అమెరికాలోకి వెళ్ళడానికి కారణం మానవ అక్రమ రవాణాదారులకు, అధికారులు, రాజకీయ నేతల మధ్య ఉన్న చట్టవ్యతిరేక సంబంధాల వల్లేనని ఉత్తర అమెరికా పంజాబీ సంఘం ప్రతినిధి సత్నామ్ సింగ్ చౌహాల్ తెలిపారు.