కోవిడ్ వ్యాప్తికి చెక్.. యాంటీ వైరల్ థెరపీని అభివృద్ధి చేసిన భారత సంతతి శాస్త్రవేత్త బృందం

రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్ 19 ఎప్పుడు అంతమొందుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.తొలుత మందులు లేకపోవడంతో ప్రపంచం ఎన్నో ఇబ్బందులు పడింది.

 Indian-origin Scientist Develops Antiviral Therapy That Block Covid Transmission-TeluguStop.com

అయితే వైద్య ప్రపంచం కృషి ఫలితంగా వ్యాక్సిన్లు, టీకాలు అందుబాటులోకి వచ్చి పెద్ద ముప్పు తప్పింది.ఈ నేపథ్యంలో కోవిడ్ చికిత్సను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను భారత సంతతికి చెందిన పరిశోధకురాలు సోనాలి చతుర్వేది సారథ్యంలోని యూఎస్ శాస్త్రవేత్తల బృందం యాంటీ వైరల్ థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఒకే డోస్, ఇంట్రానాసల్ చికిత్సను కూడా వీరు అభివృద్ధి చేశారు.

వీరి పరిశోధనను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు.శాన్‌ఫ్రాన్సిస్కోలోని గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ బృందం ఈ కొత్త చికిత్సను అభివృద్ధి చేసింది.దీనిని థెరప్యూటిక్ ఇంటర్‌ఫరింగ్ పార్టికల్ (టీఐపీ)గా పిలుస్తారు.ఇది జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుంది.

తమకు తెలిసినంత వరకు కోవిడ్ 19 లక్షణాలను, తీవ్రతను మాత్రమే కాకుండా వైరస్‌ను కూడా తొలగించే సింగిల్ డోస్ యాంటీవైరల్ ఇదేనని చతుర్వేదిఅన్నారు.చారిత్రాత్మకంగా చూస్తే SARS-CoV-2తో సహా శ్వాసకోశ వ్యాధులను కలిగించే వైరస్‌ల ప్రసారాన్ని పరిమితం చేయడం యాంటీ వైరల్ చికిత్సలకు, వ్యాక్సిన్‌లకు సవాల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో చతుర్వేది బృందం రూపొందించిన ఇంట్రానాసల్ డోస్ వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుందని గ్లాడ్‌స్టోన్ సీనియర్ ఇన్వెస్టిగేటర్ లియోర్ వీన్ బెర్గర్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube