2024 ఎన్నికలు దగ్గర పడుతుండడంతో దేశ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి.ఈసారి కేంద్రంలో అధికారం కోసం ప్రభుత్వ ప్రతిపక్షాల మద్య గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన బీజేపీని( BJP ) వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గద్దె దించాలని విపక్షాలు కంకణం కట్టుకున్నాయి.అటు అధికార బీజేపీ కూడా గెలుపు విషయంలో కాన్ఫిడెంట్ గా ఉంది.
ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీయే వర్సస్ యూపీఏ( NDA vs UPA ) మద్య జరిగే పోరులో పై చెయ్ ఎవరిది అనే చర్చ ఆసక్తికరంగా మారింది.వచ్చే ఎన్నికల్లో మోడి( Modi ) గద్దె దించాలంటే అందరూ ఒకే తాటిపైకి రావాలని నిర్ణయించుకున్న విపక్షాలు ఐక్యత మంత్రాన్ని జపిస్తున్నాయి.

నిన్న బెంగళూరు ( Bangalore )లో విపక్షాల సమావేశం కూడా జరిగింది.ఈ సమావేశానికి కొనసాగింపుగా నేడు కూడా జరగనుంది.విపక్షాల సమావేశానికి 26 పార్టీలు హాజరై బీజేపీకి వ్యతిరేకంగా నిలిచాయి.పొత్తుల విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్( Congress ) నేతృత్వంలో యూపీఏ ఉండగా.ఈసారి యుపియేను పెంరు మార్చి కొత్త పేరుతో విపక్షాలన్నీ ఏకం అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి.విపక్షాల ఐక్యతను సీరియస్ గా తీసుకున్న బీజేపీ కూడా నేడు ఎన్డీయే మిత్రపక్షాలతో సమావేశానికి సిద్దమైంది.
ఎన్డీయే సమావేశంలో దాదాపు 36 పార్టీలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

దీంతో అటు ఎన్డీయే కూటమి ఇటు యూపీఏ కూటమి ఎన్నికలే టార్గెట్ గా బలప్రదర్శనకు సిద్దం అవ్వడంతో ఏ కూటమి వైపు ఎక్కువ పార్టీలు అడుగులు వేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.కాగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇరు కూటములకు మద్దతు గట్టిగానే ఉంది.బీజేపీకి వ్యతిరేకంగా నిలిచే పార్టీల సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఎన్డీయేలో చేరే పార్టీల సంఖ్య కూడా గట్టిగానే ఉంది.
దీంతో ఏ కూటమిని తక్కువగా అంచనా వేయడానికి లేదనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం.మరి ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు సమయం ఉన్నప్పటికి.ఇప్పటి నుంచే రాజకీయ చదరంగం మొదలు కావడంతో ఏ కూటమి వైపు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటుందో చూడాలి.