102కోట్ల మంది సెల్‌ఫోన్లు ఇదీ మా విజ‌యం

దేశంలో 125కోట్ల జనాభాలో 101కోట్ల మందికి ఆధార్‌ కార్డులున్నాయి.వీరిలో 102కోట్ల మంది సెల్‌ఫోన్లు వినియోగిస్తున్నార‌ని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు.

 Nda 2nd Anual Celebrations In Ap-TeluguStop.com

రెండేళ్ళ ఎన్‌డిఎ పాలన విజయాల్ని ప్రజలకు వివరించేందుకు తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ, దేశంలో క‌మ్యూనికేష‌న్ రంగాని పూర్తి స్ధాయిలో విస్త‌రిస్తున్నామ‌ని, పేద‌వాడి అవ‌స‌రాలు తీర్చేలా ప్ర‌భుత్వం రూప‌క‌ల్ప‌న చేస్తోంద‌ని, ఇప్ప‌టికే 40కోట్లమంది ఇంటర్‌నెట్‌తో కూడిన మొబైల్స్‌ వినియోగిస్తున్నారంటే భారత్‌లో కమ్యూనికేషన్‌ రంగం సాధించిన వృద్ది కి తార్కాణం అని చెప్పారు.

డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా నినాదాల‌తో చేప‌డుతున్న అనేక పథకాలతో దేశాభివృద్ధి రేటు పెరిగిందని, ప్రపంచవ్యాప్తంగా భారత్‌వైపు చూసే పరిస్థితి నెల కొందని మంత్రిచెప్పారు.

బేఠీ బచావో.బేఠీపడావో పథకం ద్వారా బాలిక‌ల సంర‌క్ష‌ణ ప్ర‌భుత్వ‌మే చూసుకుంటుంద‌ని,.గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 91లక్షల సుకన్యయోజన ఖాతాలు తెరిచామన్నారు.వారికోసం రెండేళ్ళలో రెండున్నరలక్షల పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేసామ‌ని ఈ రెండేళ్లలో కొత్తగా 12కోట్లమందికి ఇన్సూరెన్స్‌ పాలసీలు తెరిచామన్నారు టీ విక్రేతల నుంచి చిరువ్యాపారుల వరకు ఈ రెండేళ్ళలో మూడుకోట్ల మందికి ముద్రరుణాలిచ్చామని చెప్పారు నామమాత్రపు ప్రీమియంతో బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిన ఘనత తమదేనని, రెండుశాతం ప్రీమియానికే పంటల బీమా చేపట్టామన్నారు.

జాతీయ రహదార్లు విస్తరణ‌,.గ్రామాల విద్యుద్దీకరణ శ‌ర‌వేగంతో జ‌రుపుతున్నామ‌ని, రానున్న రోజుల‌లో పేద‌ల కోసం మ‌రిన్ని ప‌థ‌కాలు నిర్ధేశించాల‌న్న‌ది ప్ర‌ధాని మోడీ ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube