తివారీ కొడుకు హత్య చేసారని నిర్ధారించిన పోలీసులు! షాకింగ్ నిజాలు వెల్లడి  

ఎన్ డి తివారి కొడుకు మరణం హత్యా నిర్ధారించిన పోలీసులు. .

Nd Tiwari Son Death Mystery Become A Murder-congress Party,death Mystery,nd Tiwari Son,up

ఎన్ డి తివారి డి ఎన్ ఎ కొడుకు రోహిత్ శేఖర్ తాజాగా చనిపోయిన సంగతి అందరికి తెలుసిందే. ఇతని మరణం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారగా. దీనిపై పోలీసులు విచారణ మొదలెట్టారు..

తివారీ కొడుకు హత్య చేసారని నిర్ధారించిన పోలీసులు! షాకింగ్ నిజాలు వెల్లడి-ND Tiwari Son Death Mystery Become A Murder

ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆసక్తికర నిజాలని పోలీసులు బయట పెట్టారు. రోహిత్‌ శేఖర్‌ది సాధారణ మరణం కాదని, ఎవరో దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం రోహిత్‌ ఊపిరాడక, గుండె ఆగి చనిపోయినట్లు వెల్లడైందన్నారు.

హత్య కేసుగా నమోదు చేసి విచారణను నేర విభాగానికి బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా నేర విభాగం రోహిత్ కుటుంబ సభ్యులని విచారించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ కేసులో అన్ని కోణాలలో విచారించి అతని మృతి వెనుక మిస్టరీని చీదిస్తామని క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

ఎన్ డి తివారి చనిపోయిన కొద్ది నెలల్లోనే రోహిత్ హత్య కావడం వెనుక ఎన్ డి తివారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా. లేక వేరే ఎవరైనా అతనిని హత్య చేసారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.