మోడీ పై ఆ ముగ్గురి భారీ ప్లాన్..బయటపెట్టిన రిపబ్లికన్ టీవీ

ప్రత్యేక హోదా ఇప్పుడు అన్ని పార్టీలకి ఇదే మంత్రం అయ్యింది.ఏపీ లో ఉన్న పార్టీలు మాత్రమే కాదు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సైతం పాత గాయాన్ని మాపుకోవడానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది.

 Ncp And Congress Planning For Early Elections-TeluguStop.com

ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో ఒక పెద్ద అంశంగా మారిపోయింది.హోదా అంశంపై మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్ సభలో వరుసపెట్టి పెట్టినా…చర్చకు రాకుండా చేయటం ద్వారా మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

అయితే మోడీ చేయాలనుకున్నానో అదే చేస్తూ.విపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మోడీపై అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.


ఈ సమయంలోనే ఎన్సీపీ ,కాంగ్రెస్ , టిడిపి అధినేతలు ఇప్పుడు ఎకమయ్యి మోడీ ని దెబ్బ కొట్టాలనే వ్యూహంలో ఉన్నారు.అందుకే ఓ భారీ ప్లాన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది.అయితే ముగ్గురి ప్లాన్ ఇదే అంటూ రిపబ్లికన్ టీవీ ఒక సంచలన కధనం ప్రసారం చేసింది.ఈ కధనం ప్రకారం వివిధ పార్టీలకు చెందిన వందమంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయటం ద్వారా మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలన్నదే ఈ ముగ్గురి ఆలోచన అని తేల్చింది.

ఈ ప్రయత్నం ద్వారా మోడీ పై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజలలో మోడీ పై ఉన్న నమ్మకాన్ని.దెబ్బకొట్టడమే ఈ ప్లాన్ తో భాగం అంటూ తెలిపింది.

చంద్రబాబు పర్యటన మొత్తం ఇదే ప్లాన్ మీదుగా జరిగిందని తెలిపింది.

రెండు రోజులు ఢిల్లీ పర్యటన చేసిన చంద్రబాబు కొన్ని కీలక సంప్రదింపులు జరిపినట్లుగా రిపబ్లిక్ ఛానల్ పేర్కొంది.

హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయటం.జగన్ చంద్రబాబు కి సవాల్ విసరడం ఆ తరువాత చంద్రబాబు వ్యూహం ఎలా ఉండబోతోంది అనే అంశంపై ఈ చర్చ జరిగిందని అంటున్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక అంశాలపై మోడీ పై ఉన్న వ్యతిరేకతని గనుకా క్యాష్ చేసుకోలేకపోతే రాజకీయంగా మోడీ ని దెబ్బకొట్టలేమని భావింఛి ముందస్తు కి అవసరమైన వేదికను సిద్దం చేసే ప్రయత్నంలో భాగంగా మూకుమ్మడి రాజీనామాల అంశాన్ని పై కి తీసుకొస్తున్నారు.

ఇందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా.

పీఎన్ బీ కుంభకోణం.ఎస్సీ.

ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన సమాచారం.ఇలా పలు అంశాలపై మోడీ ని కేంద్రాన్ని బూచి చేసి చూపించాలని తద్వారా మూడవ కూటమి ఏర్పాటు చేసి మోడీ కి వ్యతిరేకంగా జెండా ఎగురవేయాలనేది కూటమి అసలు ప్లాన్ అంటూ రిపబ్లికన్ టీవీ ప్రకటించింది…అయితే మోడీ పై కాంగ్రెస్ ఎన్సీపీ ,తెలుగుదేశం కలిసి చేయబోతున్న కూటమి దాడికి మోడీ ఏ విధంగా చెక్ పెడుటారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube