ఎన్సీబీ ముందు విచారణకి హాజరు కానున్న రకుల్ ప్రీత్ సింగ్  

NCB to question Rakul Preet today, Bollywood Drugs Probe, Drugs Mafia, Rakul Preet Singh, Deepika Padukune, Sara Ali Khan - Telugu Bollywood Drugs Probe, Deepika Padukune, Drugs Mafia, Ncb To Question Rakul Preet Today, Rakul Preet Singh, Sara Ali Khan

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది హీరోయిన్స్ కి సంబంధాలు ఉన్నాయాని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

TeluguStop.com - Ncb To Question Rakul Preet Today

మరో వైపు ఎన్సీబీ అధికారులు తమ వద్ద ఉన్న కీలక ఆధారాలతో కొంత మందిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరికొంత మందికి విచారణ కోసం నోటీసులు పంపించారు.ఈ వ్యవహారం చూస్తూ ఉంటే బాలీవుడ్ లో ఈ డ్రగ్స్ ఉచ్చు చాలా మంది మెడకి చుట్టుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

మొత్తానికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముందు విచారించనున్నారు.
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి విచారణ క్రమంలో ఆమె చెప్పిన వివరాల ఆధారం ఎన్సీబీ అధికారులు దీపిక పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు సమన్లు పంపారు.దీనిపై ఎన్సీబీ స్పందిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ రేపు విచారణకు హాజరవుతున్నారని వెల్లడించింది.

TeluguStop.com - ఎన్సీబీ ముందు విచారణకి హాజరు కానున్న రకుల్ ప్రీత్ సింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రకుల్ తో సహా, దీపికా పదుకొణే, కరిష్మా ప్రకాశ్ కూడా విచారణకు వస్తున్నారని తెలియజేశారు.మరి ఈ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్సీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఇంకా డ్రగ్స్ వ్యవహారంలో వారి సంబంధాల గురించి ఎన్సీబీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తుంది.మరో వైపు దియా మీర్జా, నమ్రత పేర్లు కూడా బయటకి రావడంతో వారిని కూడా విచారణకి పిలిచే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

#Drugs Mafia #BollywoodDrugs #Sara Ali Khan #NCBTo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ncb To Question Rakul Preet Today Related Telugu News,Photos/Pics,Images..