దీపికా పదుకునే మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం  

NCB summons Deepika Padukone\'s manager, Bollywood, Indian Celebrities, Drugs Probe, Bollywood Drugs Mafia, - Telugu Bollywood, Bollywood Drugs Mafia, Deepika Padukone\\'s Manager, Drugs Probe, Indian Celebrities, Ncb

బాలీవుడ్ లో గత కొంత కాలంగా డ్రగ్స్ వ్యవహారం పెంచు సంచలనంగా మరి ఇండస్ట్రీలో పెద్ద తలకాయలని బయటకి లాగుతుంది.సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ చేస్తూ ఉంటే అందులో డ్రగ్స్ కి సంబంధించిన భాగోతాలు బయటకి వచ్చాయి.

TeluguStop.com - Ncb Summons Deepika Padukones Manager

సుశాంత్ మృతిలో డ్రగ్స్ కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు.సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీబీఐ విచారణలో స్పష్టం చేసేసి వదిలేసింది.

అయితే డ్రగ్స్ వ్యవహారం మాత్రం రియా చక్రవర్తి మెడకి చుట్టుకుంది.రియాతో పాటు ఆమె తమ్ముడుని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.

TeluguStop.com - దీపికా పదుకునే మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

విచారణలో భాగంగా ఆమె ఇచ్చిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్,దీపికా పదుకునే లాంటి హీరోయిన్స్ ని కూడా ఎన్సీబీ అధికారులు విచారించారు.ప్రస్తుతం రియా చక్రవర్తి బెయిల్ పై ఉంది.ఆమెకి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా ఎన్సీబీ అధికారుల నిఘాలో సంచలనలు నమోదవుతున్నాయి.

ఆదివారం సీరియల్ హీరోయిన్ ని రెడ్ హ్యాండడ్ గా పట్టుకోగా సోమవారం ఎన్సీబీ అధికారుల దాడిలో దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాష్ నివాసంలో మెరుపు దాడులు చేసారు.ముంబైలోని కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో 1.8 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు లభించినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే వెల్లడించారు.ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో మరోసారి దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.

అయితే దాడుల తర్వాత ఆమె జాడ కనబడకపోవడంతో.కరిష్మా ఇంటి తలుపులకు అధికారులు నోటీసు అంటించారు.

#Drugs Probe #BollywoodDrugs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ncb Summons Deepika Padukones Manager Related Telugu News,Photos/Pics,Images..