సుశాంత్ కేసులో క‌రోనా క‌ల‌క‌లం.. అర్ధంతరంగా ఆగిపోయిన విచార‌ణ‌!  

ncb stops interrogation in sushant case due to coronavirus! ncb, interrogation, sushant case, coronavirus, covid-19, latest news, sushant singh rajput, bollywood news - Telugu Bollywood News, Coronavirus, Covid-19, Interrogation, Latest News, Ncb, Sushant Case, Sushant Singh Rajput

దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం రేపిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.సుశాంత్ మృతి చెంది మూడు నెల‌లు గ‌డిచిపోయినా.

TeluguStop.com - Ncb Stops Interrogation In Sushant Case Due To Coronavirus

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఆయ‌న ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అన్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రిగానే కొన‌సాగుతోంది.మ‌రోవైపు అధికారులు ఈ కేసులో అన్ని కోణాల నుంచి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

TeluguStop.com - సుశాంత్ కేసులో క‌రోనా క‌ల‌క‌లం.. అర్ధంతరంగా ఆగిపోయిన విచార‌ణ‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల డ్ర‌గ్స్ దందా వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌టంతో.చిత్ర ప‌రిశ్ర‌మ మొత్తం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.దీంతో నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) అధికారులు రంగంలోకి దిగి.సుశాంత్ అనుమానాస్పద​ మృతి కేసులో డ్రగ్స్​ కోణంపై లోతుగా విచార‌ణ చేప‌ట్టారు.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే సుశాంత్ మృతి కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రియా చ‌క్ర‌వ‌ర్తితో పాటు పులువురును అరెస్ట్ చేశారు.

***

అయితే తాజాగా సుశాంత్ మృతి కేసులో క‌రోనా క‌ల‌క‌లం రేగ‌డంతో.

విచార‌ణ అర్ధంతరంగా ఆగిపోయింది.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.

తాజాగా సుశాంత్ కేసు విచారిస్తున్న నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) అధికారుల్లో ఒక‌రు క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌టంతో.విచార‌ణ ఆగిపోయింది.

నిజానికి రియా చక్రవర్తి వాట్సాప్ సంభాషణల్లో సుశాంత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీ మ‌రియు టాలెంట్ మేనేజర్ జయ సాహ పేర్లు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే వారిని విచారించేందుకు ఎన్‌సీబీ అధికారులు రంగం సిద్ధం చేసింది.

దీంతో శ్రుతి మోదీ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహ దక్షిణ ముంబైలోని ఎన్‌సీబీ గెస్ట్‌హౌస్‌కు కూడా చేరుకున్నారు.కానీ, ఎన్​సీబీకి చెందిన ఓ సీనియ‌ర్ అధికారికి క‌రోనా వైర‌స్ సోక‌డంతో.

విచార‌ణ అర్ధంతరంగా నిలిపివేశారు.ఇక సుశాంత్ సింగ్ మృతి కేసు విచారిస్తున్న‌ మిగతా సభ్యులకు సైతం కరోనా టెస్టులు నిర్వహించిన అనంతరం.

తిరిగి విచారణను ప్రారంభించనున్నార‌ని తెలుస్తోంది.

#Coronavirus #Interrogation #Sushant Case #COVID-19 #SushantSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ncb Stops Interrogation In Sushant Case Due To Coronavirus Related Telugu News,Photos/Pics,Images..