బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెండితెర నుంచి బుల్లితెరకి తాకింది  

NCB interrogates TV actors Sanam Johar and Abigail Pande, Sushant Singh Rajput, Drugs Case, Bollywood, Sanam Johar, Abigail Pande, NCB - Telugu Abigail Pande, Bollywood, Drugs Case, Ncb, Ncb Interrogates Tv Actors Sanam Johar And Abigail Pande, Sanam Johar, Sushant Singh Rajput

బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా, టెలివిజన్ రెండూ కూడా సమాంతరంగా ఉంటాయి.బుల్లితెరలో ముందుగా ఎంట్రీ ఇచ్చిన నటులు తరువాత వెండితెరపై తమ అదృష్టం పరీక్షించుకొని సక్సెస్ అవుతారు.

TeluguStop.com - Ncb Interrogates Tv Actors Sanam Johar And Abigail Pande

షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా టెలివిజన్ సీరియల్స్ ద్వారానే కెరియర్ ఆరంభించారు.అలాగే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా సీరియల్స్ ద్వారానే నటుడుగా కెరియర్ ప్రారంభించారు.

ఇక బి-టౌన్ లో సెలబ్రెటీ పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే.ఈ పార్టీ కల్చర్ లో వెండితెర నుంచి బుల్లితెర నటుల వరకు అందరూ భాగస్వామ్యం అవుతారు.

TeluguStop.com - బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం వెండితెర నుంచి బుల్లితెరకి తాకింది-General-Telugu-Telugu Tollywood Photo Image

సౌత్ ఇండస్ట్రీలో టెలివిజన్ నటులు, సినిమాల వాళ్ళకి పెద్దగా సంబంధాలు లేకున్నా బాలీవుడ్ లో మాత్రం బాగానే ఉంటాయి.దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు వెండితెర నుంచి బుల్లితెరని కూడా తాకాయి.

ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్లు అయిన దీపికా పదుకొణే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్ కి ఎన్సీబీ అధికారులు విచారణ కోసం నోటీసులు జారీ చేశారు.మరో వైపు దియామీర్జా, నమ్రతా శిరోద్కర్ పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా బుల్లితెర ప్రముఖ నటి అబిగెయిల్ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు నిర్వహించింది.సోదాల అనంతరం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.

ఎన్సీబీ ఆదేశాలతో వారిద్దరూ విచారణకు హాజరయ్యారు.మాదకద్రవ్యాల సరఫరా, డీలర్లు తదితర అంశాలపై అధికారులు వారి నుంచి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

అధికారుల దగ్గర ఉన్న సమాచారం ఆధారంగానే వారిని విచారించినట్లు తెలుస్తుంది.అయితే విచారణలో వాళ్ళు ఎం చెప్పారు అనేది ఎన్సీబీ అధికారులు చెప్పేంత వరకు తెలియదు.

#NCBInterrogates #Abigail Pande #Drugs Case #SushantSingh #Sanam Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ncb Interrogates Tv Actors Sanam Johar And Abigail Pande Related Telugu News,Photos/Pics,Images..