డ్రగ్స్ కేసులో ఊపిరి సినిమా హీరోయిన్ సోదరుడు అరెస్ట్  

NCB arrests Gabriella Demetriades brother, Bollywood, Bollywood Celebrities, Drugs Probe, Drugs Mafia - Telugu Bollywood, Bollywood Celebrities, Drugs Mafia, Drugs Probe, Gabriella Demetriades Brother, Ncb

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి.ఎక్కువగా డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్లుకి లింకులు కనిపిస్తున్నాయి.

TeluguStop.com - Ncb Arrests Gabriella Demetriades Brother

పార్టీ కల్చర్ లో ఎక్కువగా డ్రగ్స్ వినియోగం ఉంటుందని ఎన్సీబీ అధికారులు కూడా గుర్తించారు.ఈ నేపధ్యంలో వారిదగ్గర ఉన్న సమాచారంతో చాలా మంది సెలబ్రెటీలపై నిఘా పెట్టారు.

వీరిలో టీవీ సెలబ్రెటీల నుంచి సినిమా సెలబ్రెటీల వరకు ఉన్నారు.ఈ నేపధ్యంలో ఎన్సీబీ అధికారుల నిఘాకి కొంత మంది సెలబ్రెటీలు అడ్డంగా దొరికిపోతున్నారు.

TeluguStop.com - డ్రగ్స్ కేసులో ఊపిరి సినిమా హీరోయిన్ సోదరుడు అరెస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

డ్రగ్స్ కి అలవాటు పడినవాళ్లు వాటిని సప్లై చేసే వారి నుంచి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లే సమయంలో అధికారులు ఉచ్చు వేసి అదుపులోకి తీసుకుంటున్నారు.ఇప్పటికే సీరియల్ హీరోయిన్ ప్రీతికా చౌహన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో నటి సప్నా పబ్బాకి నోటీసులు జారీ చేశారు.అలాగే నటి గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని అరెస్ట్ చేసారు.
ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన గాబ్రియెల్లా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తో కొంత కాలంగా డేటింగ్ లో ఉంది.వారిద్దరికీ ఈ మధ్య ఒక బాబు కూడా పుట్టాడు.

ప్రస్తుతం ఆమె ముంబైలోనే ఉంటుంది.అయితే గాబ్రియెల్లా సోదరుడు ఇంట్లో ఎన్సీబీ దాడిచేసి నిషిద్ధ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపధ్యంలో అతనిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారి సమీక్ వాంఖడే నిర్ధారించారు.అతనిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

మొత్తానికి రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు మరింత మందిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

#Drugs Probe #Drugs Mafia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ncb Arrests Gabriella Demetriades Brother Related Telugu News,Photos/Pics,Images..