నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.చాలా రోజుల తర్వాత బాలయ్యకు మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.
వీరిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కూడా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.
యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఇప్పుడు ఈ మాస్ వ్యక్తులు ఇద్దరు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో చాలా ప్రస్టేజ్ గా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా బ్యాక్ డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాస్ నేపథ్యంలో ఉండనుంది.

దీంతో నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ గ్యారెంటీ అని అనిపిస్తుంది.ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మైత్రి మూవీస్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాలని చూస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో కన్నడ స్టార్ విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

దీంతో బాలయ్య అన్ని సినిమాల కంటే ఈ సినిమా మిగతా భాషల్లో కూడా క్రేజ్ తెచ్చుకుంది.ఇక తాజాగా ఈ సినిమాకు రెండు టైటిల్స్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఈ సినిమాకు రెండు పేర్లు వినిపిస్తున్నాయి.వీర సింహారెడ్డి, అన్న గారు అన్న రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ రెండు టైటిల్స్ లో మాత్రం బాలయ్య వీర సింహారెడ్డి టైటిల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.మరి చివరి ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో చూడాలి.