రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీం మేనకోడలు దుర్మరణం...

మితిమీరిన వేగం ప్రమాదమని రోడ్డు రవాణా శాఖ వారు చెబుతున్నప్పటికీ కొంతమంది వారి మాటలు బేఖాతరు చేయకుండా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు పేరు మోసిన గ్యాంగ్ స్టార్ నయీం మేనకోడలు సాజిదా షాహినా మితిమీరిన వేగంతో 120 కిలోమీటర్ల స్పీడ్ తో వాహనాన్ని నడపడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.

 Nayeem Sajida Shaheena-TeluguStop.com

వివరాల్లోకి వెళితే షాహినా బేగం నిన్నటి రోజున తమ బంధువుల గృహప్రవేశ కార్యక్రమం నిమిత్తమై నల్గొండ కి వచ్చారు. ఆ తర్వాత పని ఉందని తన బంధువులకు చెప్పి దగ్గరలో ఉన్నటువంటి మిర్యాలగూడకి ఒంటరిగా తానే కారు నడుపుతూ బయలుదేరింది.

ఈ క్రమంలో ఓ లారీని ఓవర్టేక్  చేయడం కోసం 120 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపింది.దీంతో వేగం ఎక్కువవడంతో వాహనాన్ని అదుపు చేయలేక  పక్కనే వెళ్తున్నటువంటి  లారీ నీ ఢీకొని కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో షాహీన అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో ఇది గమనించిన తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Telugu Hyderabad, Nayeem, Nayeems Niece, Nayeemsniece-Telugu Crime News(క్�

అయితే ఇది ఇలా ఉండగా ఈమె గ్యాంగ్ స్టర్ నయీం హయాంలో జరిగినటువంటి ఓ జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అంతేగాక పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్ళింది.అయితే ప్రస్తుతం బెయిల్ తో బయటకు వచ్చి ఇలా ప్రమాదానికి గురై దుర్మరణం చెందింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube