ఆ రీమేక్ లో ఆయనే హైలెట్ అవుతాడా..!

టాలీవుడ్ స్టార్ క్యారక్టర్ ఆర్టిస్ట్, విలన్ రావు గోపాల రావు వారసుడిగా రావు రమేష్ తన తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.ఈ పాత్ర రావు రమేష్ అయితే పర్ఫెక్ట్ అనుకుంటే చాలు 100కి 200 పర్సెంట్ తన పర్ఫార్మెన్స్ తో పాత్ర రేంజ్ పెంచేస్తాడు రావు రమేష్.

 Nayattu Remake Rao Ramesh Highlight Role-TeluguStop.com

స్టార్ సినిమానా.యువ హీరో సినిమానా.

పాత్ర చిన్నదా పెద్దదా ఇలా ఏదైనా సరే ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడు రావు రమేష్.ఇక లేటెస్ట్ గా ఆయనకు మరో అదిరిపోయే రోల్ పడ్డదని తెలుస్తుంది.

మళయాళంలో సూపర్ హిట్టైన నయట్టు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆకట్టుకుంది.సినిమాలో హైలెట్ గా చెప్పుకునే వాటిలో ఆయన పాత్ర ఒకటి.

తెలుగు రీమేక్ లో ఆ పాత్రకి రావు రమేష్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.అంతేకాదు ఆ పాత్ర కోసం ఆయన నెలన్నర డేట్స్ దాకా తీసుకున్నారని టాక్.

రెమ్యునరేషన్ కూడా భారీగా ఇస్తున్నారని అంటున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నయట్టు రీమేక్ కోసం రావు రమేష్ కు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది.

అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్, అంజలి లీడ్ రోల్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube