పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నయన్ విఘ్నేష్.. ఆధ్యాత్మిక పర్యటనలో ప్రేమ జంట!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తార ప్రస్తుతం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

 Nayanthara Vignesh Busy In Marriage Works On A Spiritual Journey Details, Nayantra, Vignesh, Kollywood, Marrige, Film Industry, Nayanthara Vignesh Shivan, Spiritual Journey, Kanchi Kamakshi Temple, Sri Ranganatha Temple, Nayan Vignesh Marriage-TeluguStop.com

ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ లలో ఒకరిగాపేరు సంపాదించుకుంది నయనతార.ఈమెకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విఘ్నేశ్ శివన్‌తో గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట ఎప్పుడెప్పుడు ఒక్కటి అవుతుందా అని కోలీవుడ్ సినీ ప్రేక్షకులతో పాటు ఇతర ఇండస్ట్రీలో ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ సమయం రానే వచ్చేసింది.

 Nayanthara Vignesh Busy In Marriage Works On A Spiritual Journey Details, Nayantra, Vignesh, Kollywood, Marrige, Film Industry, Nayanthara Vignesh Shivan, Spiritual Journey, Kanchi Kamakshi Temple, Sri Ranganatha Temple, Nayan Vignesh Marriage-పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నయన్ విఘ్నేష్.. ఆధ్యాత్మిక పర్యటనలో ప్రేమ జంట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విఘ్నేశ్, నయనతార రేపు నెల అనగా జూన్ 9న తిరుమలలో వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు.ఈ క్రమంలోనే పెళ్లికి ముందు గుళ్ళూ గోపురాలు సందర్శిస్తూ ఉన్నారు.తాజాగా తిరుపతిలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ జంట ఆ తరువాత తిరుచ్చిలోని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథుని దర్శించుకున్నారు.

Telugu Kanchikamakshi, Kollywood, Marrige, Nayan Vignesh, Nayantra, Sriranganatha, Vignesh-Movie

ఆ తరువాత తంజావూరు జిల్లా అయ్యం పేట సమీపంలోని పళత్తూర్ గ్రామానికి వెళ్లి విఘ్నేశ్ కులదైవం అయిన కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి అక్కడ విశేష పూజలు నిర్వహించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే పెళ్లి తర్వాత గుళ్ళూ గోపురాలు సందర్శించాల్సిన ఈ జంట పెళ్లికి ముందే ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా బిజీ బిజీ అయిపోయారు.

మరొకవైపు వీరి పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube