సౌత్‌ హీరోయిన్స్‌ లో నయన్‌కు తప్ప మరే హీరోయిన్‌కు లేదు  

nayanthara vignesh shivan goa tour in chartered flight, Nayana Tara, Lady Oriented Movies, Vignesh Shivan, Chartered Flight, Goa Beach, Special Flight - Telugu Kollywood, Nayanatara, Telugu Film News, Tollywood, Vignesh Shivan

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార పారితోషికం బాలీవుడ్ హీరోయిన్ ల రేంజ్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆమె హీరోయిన్ గా నటించే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు స్టార్‌ హీరోల సినిమాల రేంజ్ లో తమిళనాట వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

TeluguStop.com - Nayanthara Vignesh Shivan Goa Tour In Chartered Flight

దాంతో ఆమెకు భారీగా డిమాండ్ పెరిగింది.సౌత్ లో మరే హీరోయిన్ తీసుకోని పారితోషికంను ఆమె తీసుకుంటుంది.

ఒక్కో సినిమాకు నాలుగు నుండి ఆరు కోట్ల వరకు పారితోషికంగా ఆమె తీసుకున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇంతటి పారితోషకం తీసుకుంటున్న నయనతార తన ప్రియుడు విగ్నేష్‌ శివన్‌ తో కలిసి చార్టెడ్ ఫ్లైట్ లో విహార యాత్రలకు వెళ్తుంది.

TeluguStop.com - సౌత్‌ హీరోయిన్స్‌ లో నయన్‌కు తప్ప మరే హీరోయిన్‌కు లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇటీవల ఓనం పండుగ కోసం కేరళకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన నయనతార జోడి తాజాగా గోవాకు విహారయాత్ర నిమిత్తం ప్రత్యేక విమానంలో వెళ్లడంతో పాటు తిరిగి చెన్నైకు ప్రత్యేక విమానంలో నే వచ్చారు.ఇలా సౌత్ హీరోయిన్లలో ప్రత్యేక విమానంలో తిరిగే ఏకైక హీరోయిన్ నయనతార అంటూ జాతీయ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమెకు ఉన్న స్టార్‌ డం వల్లే ఇలా ప్రత్యేక విమానంలో తిరుగుతుంది.టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు విగ్నేష్ శివన్‌ తో ప్రేమ విషయం మరి పెళ్లి విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ ని కొనసాగిస్తుంది.

ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ పెళ్లి విషయం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.ప్రస్తుతం వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా అందరికి తెలిసిందే.

ఇద్దరు వారి వారి కెరీర్‌ల తో బిజీగా ఉండటం వల్ల పెళ్లి విషయంపై ఆసక్తి చూపడం లేదు. మరో రెండు మూడేళ్ల వరకు పెళ్లి గురించి వీళ్లు ఆలోచించరేమో అనిపిస్తుంది.

#Nayanatara #Vignesh Shivan #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nayanthara Vignesh Shivan Goa Tour In Chartered Flight Related Telugu News,Photos/Pics,Images..