నయనతార పెళ్లి టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. వీడియో వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాల కాలం అవుతున్నప్పటికీ ఈమె ఇండస్ట్రీలో ఇప్పటికీ అగ్రతారగా కొనసాగడమే కాకుండా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా పేరు సంపాదించుకున్న నయనతార గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

 Nayanthara Vignesh Marriage Teaser Released By Netflix Details, Nayanthara,vignesh,netflix,tollywood, Nayanthara Vignesh Marriage Teaser, Nayanthara Vignesh Marriage, Vignesh Shivan-TeluguStop.com

ఈ క్రమంలోనే వీరి వివాహం జూన్ 9వ తేదీ మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా జరిగింది.

ఇక వీరి పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే అందుకే ఈమె పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు.

 Nayanthara Vignesh Marriage Teaser Released By Netflix Details, Nayanthara,Vignesh,netflix,tollywood, Nayanthara Vignesh Marriage Teaser, Nayanthara Vignesh Marriage, Vignesh Shivan-నయనతార పెళ్లి టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. వీడియో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే త్వరలోనే నయనతార పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది.ఇప్పటికే వీరి ఫ్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను విడుదల చేసిన నెట్ ఫ్లిక్స్ తాజాగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక టీజర్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా నయనతార, విగ్నేష్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికున్న ప్రేమను, అభిప్రాయాలను తెలియజేశారు.ప్రస్తుతం ఈ టీజర్ విడుదల కావడంతో త్వరలోనే వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన మరికొన్ని వీడియోలను కూడా నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అయితే గత కొద్ది రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ వీరి పెళ్లికి కుదుర్చుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిందని తద్వారా నయనతార విగ్నేష్ దంపతులు నెట్ ఫ్లిక్స్ కి25 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ నెట్ ఫ్లిక్స్ వీరి ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలను విడుదల చేశారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్ వేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube