సడెన్‌గా దిగుతున్న నయనతార  

Nayanthara Vasantha Kalam To Release On Feb 21 - Telugu Nayanthara, Telugu Movie News, Tollywood Gossips, Vasantha Kalam

తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.

Nayanthara Vasantha Kalam To Release On Feb 21

కాగా ఈ బ్యూటీ తమిళంలో నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘వసంతకాలం’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నిర్మాత దామెర విఎన్ఎస్ శ్రీనివాస్ అందిస్తున్నాడు.5 కలర్స్ మల్టీ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు.సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రల్లో నటించారు.

నయనతార యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మరో హైలైట్ కానుందట.

ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.నయనతార ఫ్యాన్స్ ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Nayanthara Vasantha Kalam To Release On Feb 21-telugu Movie News,tollywood Gossips,vasantha Kalam Related Telugu News,Photos/Pics,Images..