ఇష్టం లేకుండానే చేశా: నయనతార

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన నయనతార ప్రస్తుతం సౌత్‌లోనే చాలా బిజీ హీరోయిన్ అని చెప్పాలి.తమిళంలో ఆమె చేసే సినిమాలు వరుసగా సక్సెస్ అవుతుండటంతో ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్‌గా పెట్టుకోవాలని చాలా మంది స్టార్ హీరోలు కోరుతున్నారు.

 Nayanthara, Movies, Actress, Kollywood News-TeluguStop.com

ఇక ఎంత రెమ్యునరేషన్ ఇచ్చయినా సరే తమ సినిమాల్లో ఆమెను పెట్టుకోవాలని పలువురు దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు.

కాగా నయనతార తన సినీ కెరీర్ గురించి ఆసక్తికరమై కామెంట్ చేసింది.

తనకు సినిమాల్లో నటించడం ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టానంటూ చెప్పుకొచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.చదువుకుంటూ మోడలింగ్ చేస్తున్న నయన్‌కు తొలి సినిమా అవకాశం 2003లో వచ్చిందట.

మలయాళంలో ఓ సినిమాలో నటించిన తనకు సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేదట.కానీ ఆ సినిమాలో తన పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో ఈ కెరీర్‌ను ఎంచుకుందట.

ఇక ఆ తరువాత ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోని నయన్, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.అయితే ప్రస్తుతం మాత్రం నయన్ అందరికీ హాట్ ఫేవరేట్ హీరోయిన్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube