ఫుడ్ కోసం ఎదురుచూస్తున్న నయనతార.. సరదాగా ఫోటో తీసిన విగ్నేష్.. అలా నెట్టింట్లో వైరల్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ బ్యూటిగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.తను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

 Nayanthara Is Waiting For Food Vignesh Taking Photo Viral Details, Nayanatara, Tollywood, Vignesh , Photo, Viral, Social Media, Nayanthara Vignesh Shivan, Nayanthara Hungry, Nayan Vignesh Marriage, Kaathu Vakkula Rendu Kada,-TeluguStop.com

తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి బాగా ఆకట్టుకుంది.

 Nayanthara Is Waiting For Food Vignesh Taking Photo Viral Details, Nayanatara, Tollywood, Vignesh , Photo, Viral, Social Media, Nayanthara Vignesh Shivan, Nayanthara Hungry, Nayan Vignesh Marriage, Kaathu Vakkula Rendu Kada, -ఫుడ్ కోసం ఎదురుచూస్తున్న నయనతార.. సరదాగా ఫోటో తీసిన విగ్నేష్.. అలా నెట్టింట్లో వైరల్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నయన తొలిసారిగా 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఆ తర్వాత మూడేళ్లకు 2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.అలా తెలుగుతో పాటు తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.

ఇక ఈమె హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.కొంత కాలం నుంచి తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమ ఉండగా ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది.

ఆయనతో ప్రేమలో మునుగుతున్న సమయంలోనే నయన సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను తెగ పంచుకుంది.

విగ్నేష్ కూడా సినిమా షూటింగ్ లో వారిద్దరు కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా పంచుకుంటాడు.

నయన విగ్నేష్ కంటే ముందు మరో ఇద్దరు హీరోలతో ప్రేమాయణం చేసిన సంగతి తెలిసిందే.ఇక వారితో విడిపోగా ఇప్పుడు విగ్నేష్ కు సొంతమైంది.

మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో బంధుమిత్రుల, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా తను కోరుకున్న ప్రియుడు తో పెళ్లి జరుపుకుంది.

Telugu Kaathuvakkula, Nayan Vignesh, Nayanatara, Tollywood, Vignesh-Latest News - Telugu

ఇక తమకు సంబంధించిన పెళ్లి ఫోటోలను తన భర్త విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా వెంటనే పంచుకొని తెగ లైకులు సంపాదించుకున్నాడు.విగ్నేష్ చాలా వరకు తన ఫోటోలకంటే నయన ఫోటోలు పంచుకుంటాడు.పెళ్లి అయినప్పటినుంచి నిత్యం ఏదో ఒక ఫోటో పంచుకుంటూనే ఉన్నాడు.

తాజాగా మరో ఫోటో పంచుకోగా అందులో.నయన ఫుడ్ కోసం ఎదురు చూస్తుంది అని సరదాగా ఒక ఫోటో తీసి పంచుకున్నాడు.

Telugu Kaathuvakkula, Nayan Vignesh, Nayanatara, Tollywood, Vignesh-Latest News - Telugu

ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఆ ఫోటోలో నయన లుక్ చాలా కొత్తగా ఉంది.మెడలో పసుపు తాడు, చేతికి పసుపు దారం ఉండటంతో నెటిజన్లు బాగా లైకులు కొడుతున్నారు.అంతేకాకుండా తెగ కామెంట్ లు కూడా పెడుతున్నారు.ఇక నయనతార సినిమాల విషయానికొస్తే.ఇటీవలే తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాథువాకుల రెండ్ కాదల్’ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

అంతేకాకుండా రజినీకాంత్ సరసన మరో సినిమాలో నటిస్తుండగా.మలయాళం మరో సినిమా లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇవన్నీ కమిట్మెంట్ సినిమాలు కాగా ఇకపై వచ్చే మరే సినిమాకు సైన్ చేయలేదు అని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube