నయన్‌ తప్ప మనోళ్లకు మరెవ్వరు దొరడం లేదా?   Nayanthara In Chiranjeevi 152th Movie In The Direction Of Koratala     2018-12-08   10:48:43  IST  Ramesh P

సౌత్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నయనతార పేరు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు మరియు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్న నయన్‌ పారితోషికం విషయంలో కూడా సౌత్‌లో రికార్డు మోత మ్రోగిస్తూనే ఉంది. అయినా కూడా ఈమెనే కావాలంటూ సౌత్‌ స్టార్స్‌ ఆసక్తి చూపుతున్నారు. తమిళంలో ఎక్కువగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న నయనతార తెలుగులో పెద్ద సినిమాలకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది లో విడుదల కాబోతున్న సైరా మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు.

Nayanthara In Chiranjeevi 152th Movie The Direction Of Koratala-Koratala Shiva Megastar

చిరంజీవి 152వ చిత్రంగా రూపొందబోతున్న ఆ చిత్రంలో హీరోయిన్స్‌ ఎవరు అనే విషయమై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. చిరు డబుల్‌ రోల్‌ కావడంతో ఇద్దరు హీరోయిన్స్‌ నటించబోతున్నారు. ఇద్దరిలో ఒక హీరోయిన్‌ నయనతార ఫిక్స్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

Nayanthara In Chiranjeevi 152th Movie The Direction Of Koratala-Koratala Shiva Megastar

ఒకవైపు సైరాలో నయనతారతో నటిస్తున్న చిరంజీవి మరోవైపు ఆమెతోనే మరో సినిమాకు కమిట్‌ అవ్వడం చూస్తుంటే ఆమె ఏ స్థాయి క్రేజ్‌ను కలిగి ఉందో చెప్పకనే చెప్పవచ్చు. భారీ ఎత్తున అంచనాలున్న కొరటాల మూవీలో నయనతార అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో చరణ్‌ మరోసారి ఆమెను బుక్‌ చేసినట్లుగా మెగా వర్గాల వారు చెబుతున్నారు. మరో వైపు బాలకృష్ణ, వెంకీలు కూడా ఆమెపైనే ఆధారపడుతున్న విషయం తెల్సిందే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.