ఈ మధ్య కాలంలో నయనతార విఘ్నేష్ శివన్ జంట గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.చాలాకాలం క్రితమే నయన్ విఘ్నేష్ నిశ్చితార్థం జరగగా వీళ్లిద్దరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.
అయితే పెళ్లి గురించి వీళ్లిద్దరూ క్లారిటీ ఇవ్వడం లేదు.త్వరలో పెళ్లి చేసుకుని నయనతార, విఘ్నేష్ శివన్ అభిమానులకు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
అయితే తాజాగా విఘ్నేష్ శివన్ నయనతార విషయంలో చేసిన పని పని నెట్టింట వైరల్ అవుతోంది.నయనతారకు విఘ్నేష్ శివన్ ప్రేమగా గోరుముద్దలు తినిపించగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు నయనతారకు విఘ్నేష్ శివన్ పై ఎంత ప్రేమో అని కామెంట్లు చేయడం గమనార్హం.
మొదట వద్దని చెప్పిన నయనతార తర్వాత కాబోయే భర్త చేతి గోరుముద్దలు తిన్నారు.నయనతార విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో తెరకెక్కి గత నెలలో విడుదలైన కాత్తువాకుల రెండు కాదల్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.ఈ సినిమాతో అటు నయనతార ఖాతాలో ఇటు విఘ్నేష్ శివన్ ఖాతాలో ఫ్లాప్ చేరిందనే సంగతి తెలిసిందే.నయనతార విఘ్నేష్ శివన్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
నయనతార విఘ్నేష్ శివన్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.తెలుగులో నయనతార గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.నయనతార ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.