రూల్ బ్రేక్ చేసిన నయనతార.. అవాక్కయిన ఫ్యాన్స్!  

Nayanthara Attends Event On Womens Day - Telugu Event, Kollywood News, Nayanthara, Women\\'s Day

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనతార కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతుంటారు.ఆమె తమ సినిమాలో నటిస్తే అది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని వారు ఫిక్స్ అయ్యారు.

 Nayanthara Attends Event On Womens Day

అంతటి క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ కనకే ఆమె ఏం చేసినా నోరుమెదపరు.ఇక నయనతార తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దాఖలాలు చాలా తక్కువ.

ఎంతటి స్టార్ హీరోతో సినిమా చేసినా, ఆ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం నయన్ కనిపించదు.ఆమె ఎందుకు పాల్గొనడం లేదని కూడా ఎవరూ అడగరు.అంతటి డిమాండ్ ఉన్న హీరోయిన్, ప్రస్తుతం తన రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఆడియెన్స్‌లోకి వెళ్తేనే తనకు ఉన్న క్రేజ్ నిలబడుతుందని నయన్ చాలా ఆలస్యంగా గ్రహించింది.

రూల్ బ్రేక్ చేసిన నయనతార.. అవాక్కయిన ఫ్యాన్స్-Gossips-Telugu Tollywood Photo Image

దీంతో పబ్లిక్ ఈవెంట్‌లకు ఇకపై తాను కూడా హాజరు కానున్నట్లు నయన్ తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని చెప్పేసింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌కు నయన్ ముఖ్య అతిథిగా హాజరైంది.

ఈ ఈవెంట్‌లో జెండా ఊపీ మార్చ్‌ను ప్రారంభించిన నయన్, అందిరితో చాలా కలిసిపోయింది.మొత్తానికి తాను ఏర్పాటు చేసుకున్న రూల్స్‌ను తానే బ్రేక్ చేసి, అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఇక నయన్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kollywood News,nayanthara,women\\'s Day- Related....