ఆ స్టార్ హీరోల పక్కనే నయనతార ఇల్లు.. అందరూ పెద్దవాళ్లే?

Nayantaras House Next To That Star Hero House

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి వారిలో నయనతార ఒకరు.ఈమె తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Nayantaras House Next To That Star Hero House-TeluguStop.com

లేడీస్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.ఇక దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డులు సృష్టిస్తోంది.

నయనతార కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక నయనతార వ్యక్తిగత విషయానికొస్తే ఈమె మొదట్లో శింబుతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి.అనంతరం దర్శకుడు నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతో ఈమె రిలేషన్ షిప్ మెయింటైన్ చేసింది.ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

 Nayantaras House Next To That Star Hero House-ఆ స్టార్ హీరోల పక్కనే నయనతార ఇల్లు.. అందరూ పెద్దవాళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా ఈమె ప్రభుదేవ నుంచి విడిపోయింది.ఈ క్రమంలోనే ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్నారు.

Telugu Chennai, Chiranjeevi, Dhanush, Vignesh Shivan, God Gather, Jayalalitha, Nayantara, Poes Garden, Rajnikanth, Tollywood-Movie

ఇక ఈయన దర్శకత్వంలో ఈమె ఎన్నో చిత్రాలలో నటించారు.అదేవిధంగా విగ్నేష్ శివన్ నిర్మాణంలో నయనతార నెట్రికన్ అనే సినిమాలో కూడా నటించారు.త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రకటించారు.ఈ విధంగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి నయనతార హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

తన ప్రియుడు విగ్నేష్ తో కలిసి ఈమె పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.

Telugu Chennai, Chiranjeevi, Dhanush, Vignesh Shivan, God Gather, Jayalalitha, Nayantara, Poes Garden, Rajnikanth, Tollywood-Movie

ఇకపోతే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.తాజాగా ఈమే చెన్నై‌లోని పోయెస్ గార్డెన్ లో ఈ ఇంటిని కొనుగోలు చేశారు.నాలుగు పడకగదులు కలిగినటువంటి అన్ని సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన ఇంటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఏరియాలోనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత వంటి వారి ఇల్లు కూడా ఇదే ప్రాంతంలోనే ఉన్నాయి.

Telugu Chennai, Chiranjeevi, Dhanush, Vignesh Shivan, God Gather, Jayalalitha, Nayantara, Poes Garden, Rajnikanth, Tollywood-Movie

ఇలా స్టార్ సెలబ్రిటీస్ మధ్య నయనతార తన కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.త్వరలోనే ఈమె తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్నారని పెళ్లి అనంతరం వీరిద్దరు ఇక్కడే ఉండబోతున్నట్లు సమాచారం.ఇక ఈమె సినిమాల విషయానికొస్తే నయనతార ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ చిత్రంలో మెగాస్టార్ సోదరి పాత్రలో నటిస్తున్నారు.

అలాగే విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నయనతార సమంత ప్రధాన పాత్రలలో  ‘‘ కాతువాకుల రెండు కాదల్ ’’ సినిమాలో నటించారు ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఈమె వచ్చే ఏడాది తన ప్రియుడిని వివాహం చేసుకోబోతున్నట్లు పెద్దఎత్తున వార్తలు వినపడుతున్నాయి.

#Nayantara #Jayalalitha #God Gather #Chiranjeevi #Vignesh Shivan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube