ప్రేమ విషయంలో నయనతార అమాయకురాలు..!

ఏంటి ఏం మాట్లాడుతున్నారు? నయనతార ఏంటి ? ప్రేమ విషయంలో అమాయకురాలు ఏంటి అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.కానీ ఇది అక్షరాలా నిజం.

 Nayantara Very Innocent In Love , Nayanathara, Love, Innocent, Vignesh Sivan, La-TeluguStop.com

ప్రేమ విషయంలో నయనతార అమాయకురాలు అనడానికి ఇటీవల వచ్చిన ఓ వార్తే కారణం అని అంటున్నారు విశ్లేషకులు.అమాయకురాలు అనేంతగా వచ్చిన వార్త ఏంటబ్బా? అని అనుకుంటున్నారా? అదేనండీ.నయనతార మొదటి ప్రేమికుడు ప్రభుదేవా గురించి ఇటీవల ఓ వార్త వచ్చింది కదా!

ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకోనున్నట్టు వార్త వచ్చి మీడియా అంత హాల్ చల్ చేసింది కదా! అదే పెద్ద ప్రూఫ్.ఎందుకంటే.

నయనతార అప్పట్లో ఎంతో సిన్సియర్ గా ప్రేమించింది.అతడి పేరు టాటూ కూడా వేయించుకుంది.

కానీ అనుకోని విధంగా విడిపోయారు.ప్రభుదేవా భార్యతో కలిసిపోయాడు.

ఇక ఆతర్వాత నయనతార మరొకరిని ప్రేమించడం.అతడికి నయనతారకు సెట్ అవ్వకపోవడం.

ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పడం.ఆతరవాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడడం అన్ని తెలిసిన సంగతులే.

Telugu Lady, Love, Nayanathara, Prabhu Deva, Vignesh Sivan-Movie

నిజానికి నయనతార ప్రేమలో అమాయకురాలు.అందుకే సరైన వ్యక్తిని ఎంచుకోకుండా ఉండడం వల్లే మోసపోయింది.ఇంకా మంచివాడు.అందం మాయలో పడి లేచాడు అని ఇండస్ట్రీలో అందరూ అనుకున్న ప్రభుదేవా ఇప్పుడు బుద్దిగా కాపురం చేసుకోకుండా భార్యను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

దీంతో ప్రభుదేవా అసలు రంగులు బయటపడ్డాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.దీన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది నయనతార ప్రేమ విషయంలో ఎంత అమాయకురాలు అనేది.ఏది ఏమైనా నయనతార ఇప్పుడు దర్శకుడు విగ్నేష్ శివన్ తో డీప్ ప్రేమలో ఉంది.ఈ ప్రేమ అయినా పెళ్లి వరకు వెళ్ళాలి అని మనం అందరం ఆశిద్దాం! పర్సనల్ లైఫ్ లో కొన్ని దెబ్బలు తగిలినప్పట్టికి సినీ కెరీర్ విషయంలో మాత్రం నయనతార నిజంగా లేడీ సూపర్ స్టారే మరి మీరు ఏం అంటారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube