పెళ్లి విషయంలో నయన్‌ కండీషన్‌.. జుట్టు పీక్కుంటున్న ప్రియుడు

కోలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు అంటూ చాలా నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 Nayantara Conditions For His Latest Lover Vignesh Shivan-TeluguStop.com

నయన్‌ ఒక వైపు హీరోయిన్‌గా చాలా బిజీగా ఉంది.తెలుగు మరియు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తోంది.

చిన్నా చితకా చిత్రాలు కూడా కాకుండా స్టార్‌ హీరోలతో, భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తూ వస్తోంది.కెరీర్‌ ఇంత పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం అనేది అతి పెద్ద తప్పుడు నిర్ణయంగా ఆమె భావిస్తుంది.

ఒక వైపు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమను కంటిన్యూ చేస్తూనే సినీ కెరీర్‌ను కూడా కంటిన్యూ చేయాలని భావిస్తుంది.ఇప్పటికే విఘ్నేష్‌తో నయన్‌ సహజీవనంలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.వీరిద్దరు ప్రస్తుతం చెన్నైలో కలిసే ఉంటున్నారనేది చాలా రోజులుగా మీడియాలో వస్తున్న వార్తల సారాంశం.మీడియాలో వస్తున్న వార్తల విషయం ఏమో కాని వీరిద్దరి పెళ్లి ఇప్పట్లో అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు.

నయనతారను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అని ఎదురు చూస్తున్న విఘ్నేష్‌ శివన్‌కు అదుగో ఇదుగో అంటూ సమాధానం చెబుతూ వస్తోందట.

తాజాగా నయన్‌ పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చేసింది.ఇప్పటి వరకు 60 సినిమాల్లో నటించిన తాను మరో 40 సినిమాల్లో నటించిన తర్వాత అంటే సినిమాల సంఖ్య 100 అయిన తర్వాత పెళ్లికి సిద్దం అంటోంది.సినిమాలతో సెంచరీ కొడితేనే పెళ్లి అంటోంది.

అప్పటి వరకు కేవలం ప్రేమ మరియు సహజీవనమే అంటూ విఘ్నేష్‌ శివన్‌కు నయన్‌ సూచించినట్లుగా తెలుస్తోంది.నయన్‌ నిర్ణయంతో విఘ్నేష్‌ జుట్టు పీక్కుంటున్నాడు.

సౌత్‌ లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా ఈ అమ్మడు గుర్తింపు తెచ్చుకుంది.అందుకే సినిమాలను వదిలేసేందుకు మనసు ఆమెకు ఒప్పుకోవడం లేదు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube