ఈసారి నాయిని వంతు, కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు  

Nayani Narasimha Reddy Comments On Kcr-nayani Narasimha Reddy,rtc Chairman Post

పార్టీ పెట్టినప్పటి నుండి కూడా కేసీఆర్‌ సోలో బాస్‌గానే కొనసాగుతూ వచ్చాడు.తన పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రిప్‌లో పెట్టుకోవడంలో కేసీఆర్‌కు మంచి పట్టు ఉందని అంతా అనుకునే వారు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది...

Nayani Narasimha Reddy Comments On Kcr-nayani Narasimha Reddy,rtc Chairman Post-Nayani Narasimha Reddy Comments On KCR-Nayani Rtc Chairman Post

మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో కేసీఆర్‌పై సొంత పార్టీ నాయకులు ఎవరు కూడా గలం విప్పలేదు.కాని రెండవ సారి సీఎం అయిన తర్వాత పార్టీలో కొందరు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు.ఇటీవలే ఈటెల రాజేందర్‌ మరియు రసమయి బాలకృష్ణల వ్యాఖ్యలు పార్టీలో మరియు బయట తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

ఈటెలను మంత్రి వర్గం నుండి తొలగిస్తే రాజకీయ రసవత్తరంగా మారుతుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ఆ సాహస నిర్ణయం తీసుకోలేదు.ఇక నాయినిని తన మంత్రి వర్గంలోకి తీసుకుంటానంటూ ప్రకటించిన కేసీఆర్‌ నిన్నటి విస్తరణలో ఆయనకు స్థానం కల్పించలేదు.దాంతో తీవ్ర స్థాయిలో నాయిని ఆగ్రహంతో ఉన్నాడు.

Nayani Narasimha Reddy Comments On Kcr-nayani Narasimha Reddy,rtc Chairman Post-Nayani Narasimha Reddy Comments On KCR-Nayani Rtc Chairman Post

ఆర్టీసీ చైర్మన్‌ పదవిని నాయినికి కట్టబెట్టబోతున్నట్లుగా వార్తలు రావడంతో ఆయన స్పందిస్తూ నేను హోం మంత్రిగా చేశాను.ఇప్పుడు ఆర్టీసి చైర్మన్‌గా చేయాలా, టీఆర్‌ఎస్‌ పార్టీకి నేను ఒక ఓనర్‌ను అంటూ నాయిని సంచలన వ్యాఖ్యలు చేశాడు.నాకు కేసీఆర్‌ మాట ఇచ్చి తప్పాడు అంటూ నాయిని సన్నిహితుల వద్ద వాపోయాడని తెలుస్తోంది.

ఈటెల రాద్దాంతం తగ్గిందనుకుంటే ఇప్పుడు నాయిని చేస్తున్న రచ్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.ఈయన బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.