నాగార్జునకు నో చెప్పిందట... కారణం ఇదే  

Nayanathara Says No To King Akkineni Nagarjuna-

ప్రస్తుతం టాలీవుడ్‌ అయినా కోలీవుడ్‌ అయినా సీనియర్‌ హీరోలకు హీరోయిన్‌ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార.ప్రస్తుతం ఉన్న సీనియర్‌ హీరోయిన్స్‌లో అందరు హీరోలకు సెట్‌ అయ్యే హీరోయిన్‌ కేవలం నయనతార మాత్రమే.

Nayanathara Says No To King Akkineni Nagarjuna-

ఆమె కోసం పలువురు హీరోలు క్యూలు కడుతున్నారు.ఇప్పటికే చిరంజీవి సైరా చిత్రంలో చేస్తుండగా, ఇంతకు ముందే వెంకటేష్‌, బాలకృష్ణ వంటి స్టార్స్‌ నయనతారతో సినిమాలు చేశారు.

గతంలో నాగార్జున కూడా నయనతారతో సినిమా చేశాడు.అయితే ఇప్పుడు మాత్రం నాగార్జునతో సినిమాకు నయన్‌ తార నో చెప్పింది.

Nayanathara Says No To King Akkineni Nagarjuna-

ప్రస్తుతం బంగార్రాజు చిత్రం పనిలో నాగార్జున ఉన్నట్లుగా తెలుస్తోంది.ఒక వైపు మన్మధుడు 2 చిత్రంను చేస్తూనే మరో వైపు బంగార్రాజు చిత్రంను చేసేందుకు నాగార్జున రెడీ అయ్యాడు, రెండు సినిమాలను కూడా సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నాడు.

మన్మధుడు 2 చిత్రంకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.బంగార్రాజు చిత్రం కోసం నయనతారను ఎంపిక చేయాలని భావించారు.

కథానుసారంగా ఈ చిత్రంలో నయనతార ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.కాని ఆమె నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

బంగార్రాజు చిత్రంలో నాగార్జున ముసలి వ్యక్తిగా కనిపిస్తాడట.కొన్ని ప్లాష్‌ బ్యాక్‌ సీన్స్‌ మినహా ఎక్కువగా ముసలి వ్యక్తిగానే కనిపిస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.

నాగార్జునతో పాటు ఆయనకు జోడీగా నటించే హీరోయిన్‌ కూడా బామ్మగా కనిపించాల్సి ఉంటుంది.అందుకే నాగార్జునతో నటించేందుకు కథ విన్న తర్వాత నయనతార నో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

వీరిద్దరి కాంబోలో మూవీ ప్రస్తుతానికి లేనట్లే అని తేలిపోయింది.

.

తాజా వార్తలు