'సైరా' ఫ్లాప్‌ అవుతుందన్న భయంతో నయన్‌ రాలేదట!  

Nayanathara Not Attend The Saira Promotions What Is The Reason-nayanathara,ramcharan,saira Narasimha Reddy,success And Failure

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కడంతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.మొదటి వీకెండ్‌లో దాదాపుగా 200 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.దసరా సెలవులు ఇంకా వారం రోజులు ఉన్న కారణంగా సినిమా భారీగానే వసూళ్లు రాబట్టనుందని ఫిల్మ్‌ మేకర్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.ప్రస్తుతం సినిమా కలెక్షన్స్‌ నిలకడగా వస్తున్నాయి.ఇదే సమయంలో సినిమా ప్రమోషన్స్‌ సమయంలో నయనతార రాకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Nayanathara Not Attend The Saira Promotions What Is The Reason-nayanathara,ramcharan,saira Narasimha Reddy,success And Failure-Nayanathara Not Attend The Saira Promotions What Is Reason-Nayanathara Ramcharan Saira Narasimha Reddy Success And Failure

Nayanathara Not Attend The Saira Promotions What Is The Reason-nayanathara,ramcharan,saira Narasimha Reddy,success And Failure-Nayanathara Not Attend The Saira Promotions What Is Reason-Nayanathara Ramcharan Saira Narasimha Reddy Success And Failure

సైరా చిత్రం అనే కాకుండా నయన్‌ ఏ సినిమా ప్రమోషన్స్‌కు కూడా హాజరు కాదు.ఆమె కెరీర్‌ ఆరంభం నుండి కూడా ప్రమోషన్‌ వేడుకలకు దూరంగా ఉంటుంది.సైరా వంటి పెద్ద సినిమా ప్రమోషన్స్‌కు నయన్‌ హాజరు అయ్యి ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.చిత్ర యూనిట్‌ సభ్యులు ఆమెకు అధిక పారితోషికం కూడా ఆఫర్‌ చేశారని వార్తలు వచ్చాయి.

కాని ఆమె మాత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు కాలేను అంటూ తేల్చి చెప్పింది.

నయన్‌ అంత ఖరాఖండిగా చెప్పడంకు కారణం ఏమై ఉంటుందా అంటూ చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు.వారందరికి సమాధానం నయన్‌ ఇచ్చింది.తాజాగా ఒక మీడియాతో మాట్లాడుతూ తాను ఏ సినిమా ప్రమోషన్స్‌కు హాజరు అయినా ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుంది.

అందుకే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేను అంది.ఒకవేళ సైరా ప్రమోషన్స్‌లో నేను పాల్గొని ఉంటే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యేదేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేసింది.మొత్తానికి తన బ్యాడ్‌ సెంటిమెంట్‌ కారణంగానే ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నట్లుగా ఆమె చెప్పింది.