కాబోయే భర్తతో కలిసి ఇకపై అక్కడే ఉండనున్న నయన్.. ఏమైందంటే?

Nayanathara Buys A New House At Poes Garden

నయనతార, విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోతున్నారని తెలిసిందే.తన సినిమాల ప్రచారానికి హాజరు కాని నయన్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొన్నారు.

 Nayanathara Buys A New House At Poes Garden-TeluguStop.com

స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నయన్ కాబోయే భర్తతో కలిసి కొన్ని సినిమాలను నిర్మిస్తున్నారు.అయితే తాజానా నయన్ ఖరీదైన అపార్టుమెంట్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది.

త్వరలోనే నయనతార కొత్త ఇంటికి మకాం మార్చనున్నారని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.కోలీవుడ్ సినీ ప్రముఖులు ఉండే ఏరియా అయిన పోయస్ గార్డెన్ లో నయనతార ఈ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడం గమనార్హం.

 Nayanathara Buys A New House At Poes Garden-కాబోయే భర్తతో కలిసి ఇకపై అక్కడే ఉండనున్న నయన్.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నయన్ ఈ ఇంటి కోసం భారీ మొత్తం ఖర్చు చేశారని సమాచారం.నాలుగు బెడ్ రూమ్ లు ఉన్న ఈ ఇంటిలోకి త్వరలో కాబోయే భర్త విఘ్నేష్ తో కలిసి నయనతార గృహప్రవేశం చేయనున్నారు.

పోయస్ గార్డెన్ లో నయనతార త్వరలో మరో ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేయనున్నారని సమాచారం.తమిళంలో కాతువాకుల రెండు కాదల్, కనెక్ట్ సినిమాలలో నయనతార నటిస్తున్నారు.తెలుగులో నయనతార చేతిలో గాడ్ ఫాదర్ సినిమా ఉంది.కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నా నయనతార ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.నయనతారకు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Telugu Nayanatara, Vignesh Shivan-Movie

ఒక్కో సినిమాకు నయనతార 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.పెళ్లి తర్వాత నయనతార సినిమాల్లో కొనసాగుతారో లేదో తెలియాల్సి ఉంది.గత 16 సంవత్సరాలుగా వరుస ఆఫర్లతో నయనతార బిజీగా ఉన్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సైతం నయన్ విజయాలను అందుకున్నారు.సౌత్ ఇండియాలో ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార కావడం గమనార్హం.

#Nayanatara #Vignesh Shivan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube