సైరా వేడుక : నయన్‌ విషయం ఇంకా సస్పెన్స్‌  

Nayanathara Attending Saira Movie Pree Release Function Or Not-nayanathara,sri Ramarajyam,vijay Bigil Audio Function

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ వేడుక రేపు ఎల్బీ స్టేడియంలో జరుగబోతున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున ఈ చిత్రం వేడుకకు మెగా ఫ్యాన్స్‌ హాజరు కాబోతున్నారు.రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటించిన విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నయనతార ఈ ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరు కాబోతుందా లేదా అనే అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

Nayanathara Attending Saira Movie Pree Release Function Or Not-nayanathara,sri Ramarajyam,vijay Bigil Audio Function-Nayanathara Attending Saira Movie Pree Release Function Or Not-Nayanathara Sri Ramarajyam Vijay Bigil Audio

Nayanathara Attending Saira Movie Pree Release Function Or Not-nayanathara,sri Ramarajyam,vijay Bigil Audio Function-Nayanathara Attending Saira Movie Pree Release Function Or Not-Nayanathara Sri Ramarajyam Vijay Bigil Audio

మామూలుగా అయితే నయన్‌ ఎలాంటి సినిమా వేడుకల్లో కూడా పాల్గొనదు.అప్పుడెప్పుడో శ్రీరామ రాజ్య చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంది.మళ్లీ ఇప్పుడు సైరా చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ వేడుకలో ఆమె పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు.

ఆమె గతంలో మాదిరిగానే ఈ చిత్రం వేడుకలో కూడా పాల్గొనేందుకు ఆసక్తిగా లేదని తేలిపోయింది.

ఇటీవల విజయ్‌ హీరోగా నటించిన ‘బిగిల్‌’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో కూడా నయనతార పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని విజయ్‌, అట్లీల కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగిల్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు కూడా ఆమె హ్యాండ్‌ ఇచ్చింది.

అలాగే సైరాకు కూడా హ్యాండ్‌ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాలతో చాలా బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రం ప్రమోషన్స్‌కు హాజరు అవ్వడం అనుమానమే అంటూ టాక్‌ వినిపిస్తుంది.