పెళ్లిపీటలెక్కనున్న హీరోయిన్ నయనతార.. పెళ్లి ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురించి గతంలో అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తలు నిజం కాలేదు.

 Nayanatara Vignesh Shivan Marriage In March 2022, Nayanatara, Vignesh Shivan,  M-TeluguStop.com

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ వయస్సు 36 సంవత్సరాలు.నయనతారతో పాటు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోయిన్లకు ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి.

నయనతార కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

అయితే త్వరలోనే నయనతార పెళ్లి పీటలెక్కుతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఏడాది మార్చి నెలలో నయనతార విఘ్నేష్ శివన్ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే డేట్లు కేటాయించిన సినిమాల షూటింగ్ లు అన్నీ పూర్తి చేసి నయనతార పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే నయనతార పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియల్సి ఉంది.

స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్న నయనతార చిరంజీవి హీరోగా నటిస్తున్న లూసిఫర్ రీమేక్ లో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే నయనతార తన పెళ్లి గురించి వార్తలపై స్పందించడానికి, సోషల్ మీడియా ద్వారా సమాధానం ఇవ్వడానికి ఆసక్తి చూపరు.పెళ్లి తరువాత నయనతార సినిమాల్లో కొనసాగుతారో లేదో తెలియాల్సి ఉంది.

Telugu March, Nayanatara, Vighnesh Shivan-Latest News - Telugu

భవిష్యత్తులో నయనతార నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడు కావడంతో భర్త డైరెక్షన్ చేసే సినిమాలను నిర్మించాలని నయనతార ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.నయనతారకు తమిళంలో ప్రస్తుతం చేతినిండా ఆఫర్లు ఉన్నాయి.అయితే తెలుగు సినిమాలకు మాత్రం నయనతార దూరంగా ఉండటం గమనార్హం.సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత హీరోయిన్ నయనతార మరే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube