ఇది మరీ జోక్‌ గురూ.. వెంకీ, త్రివిక్రమ్ మూవీ హీరోయిన్‌ ఖరారైందట

గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌.ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమా ఏదీ లేదు.

 Nayanatara To Act In Venkatesh And Trivikram Movie, Nayanatara , Venkatesh,  Tri-TeluguStop.com

కాని ఇటీవలే మహేష్‌ బాబుతో అధికారికంగా ప్రకటించాడు.ఏడాదిన్నర కాలంగా సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగానే ఉన్న త్రివిక్రమ్‌ ఎట్టకేలకు మహేష్‌ బాబుతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా గురించి అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం లో వెంకీ మూవీ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.వెంకీ హీరోగా త్రివిక్రమ్‌ మూవీ అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

ఎట్టకేలకు ప్రారంభం కాబోతుంది అంటూ కూడా ప్రచారం చేశారు.కాని ఇప్పటి వరకు సినిమా గురించిన అప్‌ డేట్‌ అధికారికంగా ఇవ్వలేదు.

అధికారికంగా సినిమాకు సంబంధించిన ప్రకటన రాకున్నా కూడా పుకార్లు మాత్రం వందల కొద్ది వస్తున్నాయి.ఇప్పుడు కొత్త పుకారు ఒకటి షికారు చేస్తుంది.

Telugu Nayanatara, Telugu, Trivikram, Venkatesh-Movie

వెంకటేష్ తో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందా లేదా అనే విషయం క్లారిటీ లేదు.అప్పుడే హీరోయిన్ గా నయనతార అంటూ ప్రచారం చేస్తున్నారు.త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వెంకీ సినిమా లో నయనతార అంటూ మీడియా కథనాలు వస్తున్నాయి.ఇంకా సినిమా నే లేదు కాని అప్పుడే హీరోయిన్ ఏంట్రా బాబు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరీ ఇలా తయారు అయ్యారేంటీ అంటూ సోషల్‌ మీడియాలో గాసిప్స్ ను క్రియేట్‌ చేసే వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం త్రివిక్రమ్‌ దృష్టి ఎన్టీఆర్‌ 30 మాత్రమే ఉందని, ఆయన మరో సినిమా గురించి ఆలోచించడం లేదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నయనతార వార్తలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube