బాలీవుడ్ స్టార్ తో నయనతార రొమాన్స్.. ఆ హీరో ఎవరంటే?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ నయనతార పరిచయం గురించి తెలియని వారేవ్వరు లేరు.తన అందంతో, నటనతో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందుతుంది.

 Nayanatara Romance With Bollywood Hero Nayanatara, Tollywood, Romance, Shah Rukh-TeluguStop.com

తన పాత్రకు ప్రాణం పొసేలా నటిస్తుంది నయన.తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ఉంటూ లేడి ఓరియెంటెడ్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెడుతుంది.మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు, తమిళంలో కూడా నటించింది.

ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్న నయన బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే.

Telugu Nayanatara, Romance, Shah Rukh Khan, Tollywood-Movie

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ తో ఓ సినిమా చేయనున్నాడు.ఇక ఈ సినిమాకు సంకిఅనే టైటిల్ కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమాకు నయనతారను లీడ్ రోల్ లో తీసుకోవడానికి సంప్రదించారట.ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు నయన ఓకే చెప్పినట్లు ఎటువంటి ప్రకటన తెలియలేదు.

ఇక ఈ బ్యూటీ ఇదే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తుంది.

Telugu Nayanatara, Romance, Shah Rukh Khan, Tollywood-Movie

ప్రస్తుతం కాథువాకుల రెండ్ కాదల్ అనే సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా రజినీకాంత్ సరసన కూడా ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది.ఇవే కాకుండా మలయాళంలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఈ బ్యూటీ లేటు వయసులో కూడా తన గ్లామర్ తగ్గట్టు పాత్రలలో నటించడమే కాకుండా వరుస ఆఫర్ లను తన ఖాతాలో నింపుకుంటుంది.ఇక బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ సరసన నటించడానికి ఓకే చెప్పినట్లయితే నయన రేంజ్ మరింత ఎక్కువగా నిలుస్తుందని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube