రాఘవన్ లో కమల్ కోసం నయనతార చూస్తున్న దర్శకుడు

గౌతమ్ మీనన్ సినిమాలు అంటే అయితే ఘర్షణ స్టైల్ లో వైలెంట్ కథలు, లేదంటే ఏ మాయ చేసావే స్టైల్ లో క్లాసికల్ లవ్ స్టొరీలు గుర్తుకొస్తాయి.రెండు భిన్నమైన జోనర్ లో సినిమాలు తీసి సక్సెస్ లు అందుకున్న గౌతమ్ మీనన్ ఇప్పుడు తన సినిమాలకి సీక్వెల్స్ తీసుకునే పనిలో పడ్డాడు.

 Director Sets Nayanatara As A Heroine For Kamal Raghavan Sequel, Tollywood, Koll-TeluguStop.com

ప్రస్తుతం కమల్ హసన్ హీరోగా తెరకెక్కించిన రాఘవన్ అనే సైకో థ్రిల్లర్ మూవీకి సీక్వెల్ కి రంగం సిద్ధం చేసుకున్నాడు.ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసి కమల్ హసన్ కి చెప్పి ఒకే చేయించుకున్నాడు.

ఇదిలా ఉంటే రాఘవన్ సినిమాలో కమల్ హసన్ కి జోడీగా కమలిని ముఖర్జీ నటించింది.అయితే ఈ సినిమా కోసం ఒక స్టార్ హీరోయిన్ గా తీసుకోవాలని గౌతమ్ మీనన్ డిసైడ్ అయ్యాడు.

అందులో భాగంగా గత కొద్ది రోజుల నుంచి అనుష్కని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపించింది.అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ గా నయనతారని దర్శక, నిర్మాతలు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

నయనతారకి కోలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉండటంతో ఆమెని తీసుకుంటే సౌత్ మొత్తం మార్కెట్ కలిసి వస్తుందని నయనతార వైపు నిర్మాతలు సైతం మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube