నయనతార O2 టీజర్ టాక్..!

కేవలం కమర్షియల్ సినిమా హీరోయిన్ గా చేయడం కన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం.కోలీవుడ్ లోనే కాదు సౌత్ సినీ పరిశ్రమలో నయనతారలా సినిమాలు చేసే హీరోయిన్ ఎవరు లేరని చెప్పొచ్చు.

 నయనతార O2 టీజర్ టాక్..!-TeluguStop.com

ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారారు.తమిళ సినిమాలు కర్తవ్యం, మయూరి, కోకో కోకిల లాంటి సినిమాలు స్టార్ సినిమాలకు ధీటుగా ఆడాయి.

ఈమధ్యనే విజయ్ సేతుపతి, సమంత తో కలిసి కాతువాకుల రెండు కాదల్ సినిమా చేసింది నయనతార.

ఆ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నయనతార ప్రస్తుతం O2 అంటూ ఓ సినిమాతో వస్తుంది.

జి.ఎస్ విఘ్నేష్ డైరక్షన్ లో థ్రిల్లర్ సినిమాగా వస్తుంది O2.సినిమాకు సంబందించిన టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.ఇక టీజర్ చూస్తే.

నయనతార ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడుతుంది.అందులో ఉన్న ప్రయాణీకులు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎలా ప్రయత్నించారు అన్నది సినిమా కథ.సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది.సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు.

డిస్నీ + హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.నయనతార నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ O2 అని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube