లూసిఫర్ కోసం మరోసారి నయనతారకి ఒకే చెప్పిన మెగాస్టార్

సౌత్ ఇండియన్ విమెన్ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నయనతార.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కెరియర్ ఆరంభంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో తన హవా కొనసాగిస్తుంది.

 Nayanatara Lead For Megastar In Lucifer Movie, Tollywood, Telugu Cinema, Mohan R-TeluguStop.com

లేడీ ఒరియాంటెడ్ సినిమాలతో స్టార్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా నయనతార అక్కడ తన బ్రాండ్ ని కొనసాగిస్తుంది.ఇదిలా ఉండగా నయనతార కోలీవుడ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టాలీవుడ్ ని పలకరించి పోతుంది.

ఇక్కడ చేస్తున్న సినిమాలు కూడా స్టార్ హీరోల పక్కనే కావడం విశేషం.టాలీవుడ్ నుంచి ఫీమేల్ సెంట్రిక్ కథలు ఆమెకి వినిపించేవారు ఎవరూ లేరు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల కోసం మాత్రమే నయనతారని సంప్రదిస్తున్నారు.ఈమె చివరిగా తెలుగులో సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవికి జోడీగా నటించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఆమె చిరంజీవితో జత కట్టడానికి రెడీ అవుతుంది.చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది.ఇందులో చిరంజీవికి జోడీగా నయనతారని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.

ఒరిజినల్ కథలో మోహన్ లాల్ కి జోడీగా హీరోయిన్ ఉండదు.అయితే ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి, మెగా ఫ్యాన్స్ ని దృష్టిలో చిరంజీవికి హీరోయిన్ ని పెట్టినట్లు, అలాగే వారి మధ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ప్ పెడుతున్నట్లు తెలుస్తుంది.

దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube