రిలీజ్ కి రెడీ అవుతున్న నయనతార భక్తిరస చిత్రం… మొదటి సారి దేవతగా  

Nayanatara Avoid Non Veg For Devotional Movie - Telugu Kollywood, Lock Down, Nayanatara Avoid Non-veg For Devotional Movie, South Cinema, Tollywood

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.సోలోగా లేడీ ఒరియాంటెడ్ సినిమాతో సత్తా చాటుతుంది.

 Nayanatara Avoid Non Veg For Devotional Movie

మరో వైపు స్టార్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా తన పాత్ర నచ్చితే సినిమా చేయడానికి ఒకే చెబుతుంది.వయసు పైబడిన ఇప్పుడు నయనతార మరింత గ్లామర్ గా కనిపిస్తూ ఉండటంతో తమిళ దర్శకులు కూడా ఈ అమ్మడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుతం నయనతార ఇప్పటి వరకు చేయని విధంగా మొదటి సారి అమ్మవారి పాత్రలో నటిస్తుంది.ఇక అమ్మవారి కథలు ఒకప్పుడు సౌత్ లో ట్రెండ్ క్రియేట్ చేశాయి.

రిలీజ్ కి రెడీ అవుతున్న నయనతార భక్తిరస చిత్రం… మొదటి సారి దేవతగా-Movie-Telugu Tollywood Photo Image

తరువాత అలాంటి ఆధ్యాత్మిక కథలని దర్శకులు పక్కన పెట్టేసారు.

అయితే దర్శకుడు, నటుడు అయిన ఆర్ జె బాలాజీ నయనతార దేవతగా మాకుతి అమ్మన్ అనే భక్తిరస చిత్రం తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో నయనతార అమ్మవారిగా, భక్తురాలిగా ద్విపాత్రాభినయం చేస్తుంది.తాజాగా నయన్ అమ్మవారి గెటప్ లో ఫోటోలని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.భక్తిరస చిత్రం కావడంతో ఈ మూవీ చిత్రీకరణ సమయంలో నయనతార చాలా నిష్టగా ఉంటుందట.క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న సమయంలో హిందూమతంలోకి మారింది.

అప్పటి నుంచి తరుచుగా ఆలయాలు దర్శనం కూడా చేసుకుంటుంది.ఈ నేపధ్యంలో మొదటిసారి దేవత పాత్ర చేస్తూ ఉండటంతో నయన్ తో పాటు చిత్ర యూనిట్ లో ఎవరు కూడా షూటింగ్ సమయంలో నాన్ వేజ్ ముట్టుకోలేదని చెపుతున్నారు.

థియేటర్స్ ప్రారంభం అయిన వెంటనే మూకుతి అమ్మన్ మూవీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nayanatara Avoid Non Veg For Devotional Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test